జ్ఞాపకశక్తి పెరగాలంటే వీటిని తినండి..

First Published Jan 26, 2023, 1:55 PM IST

ఈ ఉరుకుల పరుగల జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే  సమస్య మెమోరీ పవర్ ను కోల్పోవడం. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, విటమిన్ బి తో పాటుగా ఇతర పోషకాల వల్ల కూడా మెమోరీ పవర్ తగ్గుతుంది. 
 

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనమందరం ఎదుర్కొనే సర్వ సాధారణ సమస్య జ్ఞాపకశక్తిని కోల్పోవడం. వ్యక్తి వయస్సు, అనారోగ్య సమస్యలు, నిద్ర, ఒత్తిడి వంటి అనేక అంశాలు జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ఫ్యాటీ ఫిష్

ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ (ఈఎఫ్ఏ)ను మన శరీరం దానంతట అదే ఉత్పత్తి చేయదు. దీనర్థం వీటిని మనం ఆహారాల ద్వారే పొందాలి. మెదడును ఆరోగ్యంగా ఉంచే, మెమోరీ పవర్ ను పెంచే అత్యంత ప్రభావవంతమైన ఒమేగా -3 కొవ్వులు సహజంగా జిడ్డుగల చేపలలో ఇపిఎ, డిహెచ్ఎ రూపంలో పుష్కలంగా ఉంటాయి. 
 

బ్లూబెర్రీలు

బ్లూ బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు జరిగే డ్యామేజ్ ను తొలగిస్తాయి. అలాగే ఇవి మీకు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. 
 

coffee

కప్పు కాఫీ

జ్ఞాపకశక్తిని పెంచడంలో కాఫీ గ్రేట్ గా సహాయపడుతుంది. కాఫీలో ఉండే కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. డోపామైన్ వంటి కొన్ని "మంచి" న్యూరోట్రాన్స్మిటర్లను కూడా కెఫిన్ పెంచుతుంది. 
 

Image: Getty Images

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంచడానికి చాలా చాలా అవసరం. ఈ గుమ్మడి గింజల్లో ఒత్తిడిని తగ్గించే మెగ్నీషియం, బి విటమిన్లు, ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 

గుడ్లు

గుడ్లు కోలిన్ అనే విటమిన్ భాండాగారం. జ్ఞాపకశక్తిని నిలుపుకునే కణాల నిర్మాణానికి ఈ విటమిన్ చాలా చాలా అవసరం. విటమిన్ బి 1, విటమిన్ బి 3, కోలిన్ తో సహా ఇతర బి విటమిన్లు మెదడు సాధారణ పనితీరును నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో సమృద్ధిగా ఉండే కొలిన్ మెదడు జ్ఞాపకశక్తిని పెంచే ఎసిటైల్కోలిన్ అనే రసాయనానికి అవసరం.

click me!