మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా? మీకు తెలియకుండానే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Dec 4, 2024, 8:36 AM IST

earphones-earbuds: ఎక్కువ సౌండ్ ను ఎక్కువ కాలం పాటు మీ చెవులకు వినిపిస్తే చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. అలాగే, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 

earphones-earbuds: ఇయర్‌బడ్‌లు మీ వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి 

ఈ రోజుల్లో చాలా మంది ఇయర్‌ఫోన్‌లు లేదా ఇయర్ బడ్స్, హెడ్ సెట్స్ ను తమ ఆడియో అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరమైనవిగా మారాయి. వీటిని కమ్యూనికేషన్ లేదా ఆడియో వినోదం, మ్యూజిక్ వినడం కోసం ఉపయోగిస్తారు. టెక్నాలజీ మారుతున్న కొద్ది ఇవి అనేక వేరియంట్‌లలో లభిస్తున్నాయి. 

అన్ని వయసుల వారు ఇయర్‌ఫోన్‌ల సహాయంతో సంగీతం, పాడ్‌క్యాస్ట్‌లు, సినిమాలు చూస్తారు. ఫోన్‌లో మాట్లాడతారు. కానీ ఇయర్‌ఫోన్‌ల ఆనందకరమైన అనుభవంతో పూర్తిగా ఆకర్షితులవుతున్నారు కానీ, ఇక్కడ మీకు తెలియకుండానే మీ వినికిడి శక్తిని కోల్పోతున్నారు. అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ఇయర్‌ఫోన్‌లు లేదా ఇయర్ బడ్స్, హెడ్ సెట్స్ మిమ్మల్ని ఎలా అనారోగ్యానికి గురిచేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇలాగైతే ఇయర్ ఫోన్లతో త్వరగానే వినికిడి లోపం 

అధిక సౌండ్ అనేక అనారోగ్యాలను కలిగిస్తుంది. ఎక్కువ సౌండ్ ను ఎక్కువ రోజులు వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించే కణాలకు నష్టం కలుగుతుంది. పెద్ద శబ్దం ఒక వ్యక్తిలో వినికిడి లోపం కలిగిస్తుంది. చెవి పూర్తిగా ఇమిడిపోయే ఇయర్‌ఫోన్‌లతో మరింత హానికరం, ఎందుకంటే అవి చెవిపోటులోకి వచ్చే ధ్వనిని గణనీయంగా పెంచుతాయి. ఇది చి వినికిడి లోపాన్ని త్వరగా వచ్చేలా చేస్తుంది. 


Image: Getty

క్లియర్ సౌండ్ కోసం ఎక్కువ వ్యాల్యూమ్ తో  చెవికి పెద్ద నష్టమే.. 

చుట్టుపక్కల సౌండ్  కారణంగా మరింత క్లియర్ గా వినడం కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వారు అవుట్ ఫుట్ సౌండ్ ను పెంచుతారు. ఇది వినియోగదారుకు తెలియకుండానే చాలా బిగ్గరగా ఉంటుంది. దీని కారణంగా కొంత కాలం త‌ర్వాత మీ వినికిడి శ‌క్తి దెబ్బతింటుంది. 

Image: Getty

ఇయ‌ర్ ఫోన్ల‌తో బ్యాక్టిరియా వ్యాప్తి.. చెవి ఇన్‌ఫెక్షన్లు

రోజూ ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల చెవి కాలువలో తేమ, బ్యాక్టీరియా చేరి, చెవి ఇన్‌ఫెక్షన్‌లకు దారి తీస్తుంది, ఇది తాత్కాలిక వినికిడి లోపాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్, నొప్పికి కూడా దారితీయవచ్చు. ఇయర్‌ఫోన్‌లను ఇతరులతో పంచుకోవడం వల్ల వారి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి.

చెవిలో మూడు భాగాలు ముఖ్య‌మే..

చెవి శబ్దాలను ప్రాసెస్ చేయడానికి కలిసి పనిచేసే మూడు భాగాలతో ఉంటుంది. బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. లోపలి చెవిలో భాగాన్ని కోక్లియా అని పిలుస్తారు, ఇది చిన్న జుట్టు కణాలను కలిగి ఉంటుంది. ఈ జుట్టు కణాలు మెదడుకు ధ్వని సందేశాలను పంపడంలో సహాయపడతాయి. పెద్ద శబ్దం జుట్టు కణాలను దెబ్బతీస్తుంది. దీని కార‌ణంగా  కోక్లియా మెదడుకు ధ్వని సందేశాలను పంప‌లేదు. 

అలాగే, అధిక శ‌బ్దం మీ శరీరంలోని ఇతర భాగాలకు నష్టం క‌లిగించ‌డంతో పాటు  లోపలి చెవిని దెబ్బ తీస్తుంది. ఇది న‌యం కావ‌డం చాలా క‌ష్టం. దీంతో త‌ర్వాతి రోజుల్లో ఎక్కువ హెయిర్ సెల్స్ దెబ్బతింటుంటే, మీ వినికిడి శ‌క్తి పూర్తిగా పోయే అవ‌కాశ‌ముంది. 

ఇయర్‌బడ్‌లను ఎలా ఉప‌యోగించాలి?  

మీరు ఇయ‌ర్ ఫోన్ లేదా ఇయ‌ర్ బ‌డ్ లేదా మ‌రేదైనా వాటిని ఎక్కువసేపు లేదా చాలా ఎక్కువ సౌండ్ పెట్టుకుని విన‌డం చేయ‌కుంటే వీటితో చెవికి పెద్ద‌గా న‌ష్టం క‌ల‌గ‌ద‌ని  వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ వినియోగించే గ్యాడ్జెట్ వాల్యూమ్‌ 60 శాతం మించకుండా ఉప‌యోగించాల‌ని చెబుతున్నారు. వీటిని ఉప‌యోగించే స‌మ‌యం 60 నిమిషాలుగా పెట్టుకోవాల‌నీ, ఆ త‌ర్వాత కొంత స‌మ‌యం వాటి నుంచి చెవుల‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని సూచిస్తున్నారు. 

Latest Videos

click me!