ఈ రోజుల్లో డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే.. డయాబెటిక్ సమస్య ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్వీట్స్ తినకూడదు.. ఫ్రూట్స్ కూడా కొన్ని తినకూడదు. ఇవి మాత్రమే కాదు… షుగర్ ఎక్కువగా ఉన్నవారు.. ఎక్కువ గా వైట్ రైస్ కూడా తినకూడదు. తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ… మనం అన్నం వండే సమయంలో.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా షుగర్ పేషెంట్స్ తినొచ్చట. మరి, ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం…
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువ సేపు నానపెట్టాలట. కనీసం రెండు గంటలు బియ్యం నానపెట్టాలి. ఇలా ఎక్కువసేపు నానపెట్టిన తర్వాత.. అన్నం వండి తినాలట. ఎందుకంటే వైట్ రైస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది.. గ్లూకోజ్ పెరగడానికి కారణం అవుతుంది. ఇలా నానపెట్టి తినడం వల్ల గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట.
ఇక అంతేకాదు.. అన్నం ఉడికే సమయంలో నీటిలో నుంచి తెల్లగా బుడగల రూపంలో వస్తుంది. దానిని కూడా తీసేయాలట. అలా తీసేసి అన్నం వండితే.. గ్లైసమిక్ ఇండెక్స్ ఇంకాస్త తగ్గుతుంది. దీని వల్ల ఇన్సులిన్ పెరిగే అవకాశం తగ్గుతుంది.
అన్నం ఉడికే సమయంలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె చేర్చాలి. ఇలా చేయడం వల్ల గ్లైసమిక్ ఇండెక్స్ 50 శాతం తగ్గుతుంది. దాని వల్ల ఆ అన్నం తిన్నా కూడా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎలాంటి భయం లేకుండా అన్నం తినొచ్చు.
అన్నం వండే సమయంలో రెండు బిర్యానీ ఆకులను కూడా చేర్చాలి. బిర్యానీ ఆకు వేయడం వల్ల ఆ అన్నానికి న్యూట్రియంట్స్ యాడ్ అవ్వడమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అన్నంలో నిమ్మరసం పిండి తిన్నా కూడా.. పోషకాలు అందుతాయి.