కొబ్బరి కాయను తడి గుడ్డతో శుభ్రం చేశాక దాన్ని అలా వదిలేయకండి. వెంటనే శుభ్రమైన పొడి క్లాత్ తో కొబ్బరికాయను బాగా తుడవండి. తడి ఉందంటే మళ్లీ బూజు పెరిగిపోతుంది. కాబట్టి కొబ్బరికాయ పూర్తిగా ఆరిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా తడి లేకుండా ఆరబెట్టడం వల్ల తెలుపుదనం వచ్చేస్తుంది.
కొబ్బరికాయను మళ్లీ తాజాగా మార్చేందుకు నెయ్యిని ఉపయోగించాలి. కొద్దిగా దేశీ నెయ్యి తీసుకుని తెల్లటి కొబ్బరికాయ గుజ్జు మొత్తానికి మానంగా రాయండి. నెయ్యి ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. కొబ్బరికాయ ఎండిపోకుండా తాజాగా ఉండేలా చేస్తుంది.
కొబ్బరికాయను నిల్వ చేసే పద్ధతి కూడా తెలుసుకోవాలి. గాలి చొరబడని డబ్బా తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు వేసి ప్యాక్ చేయండి. గాలి చేరకుండా జాగ్రత్త పడండి. ఇలా చేస్తే కొబ్బరికాయ ఫ్రిజ్‌లో ఒక సంవత్సరం వరకు తాజాగా ఉంటుంది.