పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా.. అయితే మగవారు ఈ 5 పరీక్షలు చేయించుకోవాల్సిందే!

Published : Nov 22, 2026, 07:07 PM IST

పెళ్లయిన భార్యా భర్తలు పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు. అయితే అలా ప్లాన్ చేసుకోగానే మహిళలు మాత్రమే కాదు మగవారు కూడా కొన్ని టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరీక్షలు ఇక్కడ ఇచ్చాము.

PREV
13
మగవారు చేయించుకోవాల్సిన పరీక్షలు

పెళ్లైన దంపతులు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు మహిళల ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెడతారు. కానీ పురుషుల ఆరోగ్యం కూడా గర్భధారణలో చాలా ముఖ్యం. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, వాటి కదలిక సరిగా లేకపోవడం వల్ల పిల్లలు పుట్టడంలో ఆలస్యం కావచ్చు. అందుకే పిల్లల కోసం ప్రయత్నించే ముందే పురుషులు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా వీర్యకణాల నాణ్యత తెలుసుకోవడానికి సీమెన్ అనాలిసిస్ పరీక్ష చేయించుకోవాలి. ఇందులో వీర్యకణాల సంఖ్య, వాటి కదలిక, ఆకారం ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. మరో పరీక్ష స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. ఇందులో వీర్యకణాల్లో జన్యు పదార్థం దెబ్బతిన్నదా లేదా అనేది తెలుసుకుంటారు. వీర్యకణాల నాణ్యతపై అనుమానాలు ఉన్నప్పుడు వైద్యులు ఈ పరీక్షను సూచిస్తారు.

23
తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్ష

పురుషులు చేయించుకోవాల్సిన మరో ముఖ్యమైన పరీక్ష తలసేమియా క్యారియర్ టెస్ట్. తలసేమియా అనేది పిల్లలకు తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యుపరమైన రక్త సమస్య. భార్యాభర్తలు ఇద్దరూ ఈ సమస్యకు క్యారియర్లుగా ఉంటే పుట్టబోయే బిడ్డకు తలసేమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇద్దరూ ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఎస్ఎంఏ క్యారియర్ స్క్రీనింగ్ కూడా ఉపయోగపడుతుంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన సమస్య వచ్చే ప్రమాదాన్ని ఈ పరీక్ష ద్వారా అంచనా వేయవచ్చు. ఇక బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. రక్తపోటు, మధుమేహం, అధిక బరువు సమస్యలు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకోవడం మంచిది.

33
ఈ అలవాట్లు పెంచుకోవాలి

పరీక్షలు చేయించుకోవడంతో పాటు రోజువారీ అలవాట్లపైనా దృష్టి పెట్టాలి. ధూమపానం, మద్యపానం వీర్యకణాల నాణ్యతను దెబ్బతీయవచ్చు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. రోజూ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, గింజలు, పప్పుధాన్యాలను భోజనంలో చేర్చుకోవాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. శరీరానికి సరిపడా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. వీర్యకణాలు పూర్తిగా తయారవడానికి దాదాపు 74 రోజులు పడుతుంది. అందుకే పిల్లల కోసం ప్రయత్నించే ముందే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. అయితే ప్రతి పురుషుడికి ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి కాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సూచనల ప్రకారం అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories