Chanakya Niti: మనిషి మాటకు ఎంతో శక్తి ఉంటుంది. ఒక మాట బంధాన్ని పెంచగలదు, తెంచగలదు. అందుకే ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎవరితో ఏం చెప్పాలి? వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. చాణక్యుడి ప్రకారం తెలివైన వ్యక్తి ఎవరికీ చెప్పని ఆ 5 విషయాలేంటో చూద్దాం.
చాణక్యుడి ప్రకారం మనిషి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయాన్ని మన దగ్గరే ఉంచుకోవాలి అనే వివేకం కూడా జీవితంలో విజయంలో ఒక భాగమే. మనిషి ఎంత తెలివైనవాడైనా, ఒకసారి చెప్పిన మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే తెలివైన వ్యక్తి తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరి ముందు పెట్టడు. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో గోప్యత పాటిస్తాడు. అవేంటో చూద్దాం.
26
వ్యక్తిగత బలహీనతలు
ప్రతి మనిషికీ కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి మన మంచిని కోరుకునేవాడు కాకపోవచ్చు. అందుకే మన భయాలు, లోపాలు, మనం ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను అందరికీ చెప్పడం మంచిది కాదు. ఒకసారి మన బలహీనత మరొకరికి తెలిసిన తర్వాత, దాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.
36
ఆర్థిక పరిస్థితి
ఎంత సంపాదిస్తున్నారు, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ ఆస్తులు ఉన్నాయి వంటి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు విషయంలో ఎక్కువగా మాట్లాడటం కొన్నిసార్లు అనవసరమైన సమస్యలకు కారణమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న కొందరు అవసరం లేని అంచనాలు పెట్టుకోవచ్చు. మరికొందరు మీ దగ్గర సహాయం కోసం పదేపదే రావచ్చు. ఇంకొందరు మీ సంపాదనను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది.
మనం ఏం చేయబోతున్నాం, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాం, ఏ వ్యాపారం ప్రారంభించబోతున్నాం వంటి విషయాలను పని పూర్తయ్యేలోపు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రణాళికను పదిమందితో చర్చిస్తే పదిమంది అభిప్రాయాలు వస్తాయి. కొన్నిసార్లు అవి మనలో అనవసరమైన సందేహాలను కూడా కలిగిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో మన ప్రణాళికలను ఇతరులు ముందుగానే తెలుసుకుని అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది.
56
వ్యక్తిగత సమస్యలు, రహస్యాలు
ప్రతి కుటుంబంలోనూ చిన్నచిన్న విభేదాలు, సమస్యలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరి దగ్గర చెప్పుకుంటూ వెళ్లడం వల్ల సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయాలు, కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమస్యలు, ఆస్తి సంబంధిత వివాదాలను అనవసరంగా బయటకు చెప్పడం వల్ల కుటుంబ గౌరవంతో పాటు సంబంధాలు కూడా దెబ్బతినవచ్చు.
66
చేసిన మంచి పనులను పదేపదే చెప్పుకోవడం
మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు దాన్ని ప్రతి సందర్భంలో గుర్తుచేస్తూ గొప్పగా చెప్పుకోవడం వల్ల ఆ సహాయం విలువ తగ్గిపోవచ్చు. నిజమైన సహాయం అనేది ప్రతిఫలం ఆశించకుండా ఉంటుంది. ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయడం, కష్ట సమయంలో అండగా నిలవడం, దానం చేయడం వంటి మంచి పనులను ప్రచారం కోసం ఉపయోగించాల్సిన అవసరం లేదు.