Fridge Cover: ఫ్రిడ్జ్‌కు కవర్ వేస్తున్నారా? ఎన్ని రకాలుగా నష్టమో తెలుసుకోండి

Published : Aug 03, 2026, 11:31 AM IST

Fridge Cover: మీ ఇంట్లో ఉన్న ఫ్రిజ్ పై కవర్ వేస్తున్నారా? దుమ్ము పడుతుందని కవర్ వేస్తే అది ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ఈ చిన్న పొరపాటు ఫ్రిడ్జ్‌ను పాడు చేయడమే కాదు, అగ్ని ప్రమాదానికి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది.

PREV
13
ఫ్రిజ్ పై కవర్ వేయకూడదా?

ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ ఉంటుంది. దానిపై దుమ్ము, ధూళి పడుతుందని, అలాగే అందంగా కనిపించాలని ఎంతో మంది దానిపై కవర్ వేస్తుంటారు.  కానీ ఇది చాలా పెద్ద పొరపాటు అని చెబుతున్నారు నిపుణులు. ఇలా కవర్ వేయడం వల్ల ఎప్పుడైనా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్రిజ్ లోపల వైపు చల్లగా ఉన్నా దాని బయటి భాగం అంటే బాడీ మాత్రం వేడిగానే ఉంటుంది. పైన కవర్ వేస్తే, ఆ వేడి బయటకు పోలేక ఫ్రిడ్జ్ ఓవర్‌హీట్ అవుతుంది.

23
ఫ్రిజ్ ఎందుకు వేడెక్కుతుంది?

ఫ్రిడ్జ్‌ను చల్లగా ఉంచడానికి కంప్రెసర్ నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. కంప్రెసర్.. కాయిల్స్ ద్వారా వేడిని బయటకు పంపుతూనే ఉంటుంది. కానీ కవర్ అడ్డుగా ఉంటే మాత్రం వేడి బయటకు పోకుండా ఒక్కోసారి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రిజ్ పై కవర్ వేయకపోవడం చాలా ఉత్తమం. 

ఫ్రిజ్ బాగా వేడెక్కితే  కంప్రెసర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఓవర్‌హీటింగ్ కారణంగా ఉష్ణోగ్రతను కొలిచే సెన్సర్లు పాడైపోతాయి. దీనివల్ల కూడా ఫ్రిజ్ కూడా పనిచేయదు.

33
కరెంట్ బిల్లు పెరిగిపోతుంది

ఫ్రిజ్ పై కవర్ వేయడం వల్ల కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. దాని కంప్రెసర్‌పై ఎక్కువ భారం పడుతుంది. దీంతో ఫ్రిజ్ లోపల కూలింగ్ కోసం కంప్రెసర్ మరింత కరెంటును వాడుకుంటుంది. దీనివల్ల కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది.

ఫ్రిజ్ పై కవర్ వేయడం వల్ల లోపల ఉష్ణోగ్రత పదేపదే మారుతూ ఉంటుంది. దీనివల్ల కూలింగ్ కూడా సరిగా ఉండదు. ఫలితంగా లోపల పెట్టిన ఆహారం త్వరగా పాడైపోతుంది. ఫ్రిడ్జ్ చుట్టూ గాలి సరిగా ఆడితేనే కాయిల్స్ చల్లగా ఉంటాయి. కానీ కవర్ వేయడం వల్ల ఈ వెంటిలేషన్ వ్యవస్థకు అడ్డంకి ఏర్పడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories