Chemical Mangoes: వేసవి మామిడి పండ్ల సీజన్. మార్కెట్లో దొరికేవన్నీ సహజంగా పండిన మామిడి పండ్లు కావు. వ్యాపారులు కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో పండ్లను పండిస్తున్నారు. వాటి రంగు, వాసన, స్పర్శను బట్టి గుర్తించవచ్చు.
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. రకరకాల మామిడి పండ్లను ప్రజలు ఇష్టంగా కొని తింటారు. కానీ, మార్కెట్లో దొరికేవన్నీ సహజంగా పండినవి కావు. వ్యాపారులు ఆ పండ్లపై కాల్షియం కార్బైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ వంటి రసాయనాలను చల్లి పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇలాంటి పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి ఆర్టిఫిషియల్ పండ్లను గుర్తించి తినకపోవడమే మంచిది.
మామిడిపండుు రంగును జాగ్రత్తగా గమనించండి. సహజంగా పండిన పండ్లు ఒకే రంగులో ఉండవు. అక్కడక్కడా పచ్చ, పసుపు, లేత నారింజ రంగులు కలిసి ఉంటాయి. రసాయనాలతో పండించిన పండ్లు మాత్రం చూడటానికి ఒకేరకమైన పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి.
25
తొడిమ దగ్గర వాసన
మామిడి పండు కొన్న తరువాత వాటి తొడిమ దగ్గర ముక్కు పెట్టి వాసన చూడండి. సహజంగా పండిన మామిడి పండు స్వచ్ఛమైన తియ్యటి వాసన వస్తుంది. రసాయనాలతో పండిన పండు తొడిమ దగ్గర ఎలాంటి సువాసన ఉండదు. లేదా ఒక రకమైన కెమికల్ వాసన వస్తుంది.
సహజంగా పండిన పండును చేతుల్లోకి తీసుకుని మెల్లగా నొక్కితే మెత్తగా (Soft) ఉంటుంది. రసాయనాలతో పండించిన పండును నొక్కితే పైకి మెత్తగా అనిపించినా, లోపల కాయలా గట్టిగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ పండ్లు మరీ ఎక్కువగా మెత్తబడి ఉంటాయి.
35
మామిడి పండును కోసి చూడటం
మామిడి పండు కొన్న తరువాత పండును కోసి చూసినప్పుడు లోపల గుజ్జు అంతా ఒకే రంగులో, రసంతో నిండి ఉంటే అది సహజంగా పండే పండు. అదే లోపల కొన్నిచోట్ల పండి, మరికొన్ని చోట్ల కాయలాగా, పీచు భాగాలు గట్టిగా ఉంటే అది రసాయనాలతో పండించిన పండుగా భావించాలి.
మామిడి పండ్లు కొన్నాక అవి ఎలా పండాయలో తెలుసుకునేందుకు ఒక బకెట్ నీటిలో మీరు కొన్న మామిడి పండ్లను వేయండి. సహజమైన పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువుగా ఉంటాయి. అవి నీటిలో వేయగానే మునిగిపోతాయి. కృత్రిమ పండ్లు రసాయన మార్పుల వల్ల బరువు తగ్గి నీటిపై తేలుతాయి. అలా కూడా మీరు అవి ఎలా పండించినవో అర్థం చేసుకోవచ్చు.
55
నమ్మకమైన చోట కొనండి
కృత్రిమంగా మైనం లేదా రసాయనాలు పూసినట్టుగా, కళ్లను ఆకట్టుకునేలా మెరిసిపోయే మామిడి పండ్లను కొనకపోవడమే మంచిది. సహజంగా పండిన పండ్ల తొక్క మామూలుగానే ఉంటుంది. పండ్లను పండించేందుకు వాడే కాల్షియం కార్బైడ్ చాలా ప్రమాదకరం.దీనివల్ల తలనొప్పి, తల తిరగడం, కడుపులో మంట, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చాలా దేశాల్లో ఈ రసాయనం వాడకాన్ని నిషేధించారు.