Cleaning Hacks: బకెట్, మగ్ పై ఉన్న మొండి మరకలు పోవాలంటే అద్భుతమైన చిట్కాలు

Published : Feb 23, 2026, 04:05 PM IST

Cleaning Hacks: ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై తెల్లటి, పసుపు రంగు మరకలు కనిపిస్తాయి. అవి చాలా మొండి మరకలుగా మారుతాయి.  ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు ఇవి ఇబ్బందిగా కనిపిస్తాయి.  ఈ మొండి మరకల్ని వదిలించే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడున్నాయి.

PREV
15
కొత్తవాటిలా మెరవాలంటే..

బాత్రూంలో వాడే బకెట్లు, మగ్గులు పాతవిగా మారి చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. వాటిని మళ్లీ కొత్తవాటిలా మెరిసిపోవాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు ప్రయత్నించవచ్చు. బాత్రూంలో వాడే బకెట్లు, మగ్గులపై నెలలు గడిచేకొద్దీ తెల్లటి, పసుపు రంగు మరకలు, సబ్బు మరకలు పేరుకుపోతాయి.  చాలా ప్రాంతాల్లో ఉప్పు నీళ్లు వాడతారు. దీనివల్ల కూడా బకెట్, మగ్గుపై తెల్లటి మరకలు ఏర్పడతాయి. వీటిని శుభ్రం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ మొండి మరకలను శుభ్రం చేయడానికి మీ వంటగదిలోని కొన్ని వస్తువులే చాలు. ఖర్చు లేకుండా ఈ బకెట్లను మిలమిల మెరిసేలా చేయవచ్చు.

25
బేకింగ్ సోడా, నిమ్మరసం

ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా, నిమ్మరసం కచ్చితంగా ఉంటుంది. ఒక గిన్నెలో 2 చెంచాల బేకింగ్ సోడా తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసం వేసి కలపండి. ఈ పేస్ట్‌ను మరకలున్న చోట రాసి 10-15 నిమిషాలు వదిలేయండి. తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది నీటితో కడిగితే బకెట్, మగ్గులు కొత్తవాటిలా మెరుస్తాయి.

35
వెనిగర్‌తో క్లీనింగ్

తెల్ల వెనిగర్ మార్కట్లో లభిస్తుంది. ఈ మరకలను తొలగించడానికి వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు వెనిగర్‌లో ఒక చెంచా డిష్‌వాష్ లిక్విడ్ కలపండి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్ సహాయంతో మరకలను రుద్దండి . కేవలం 10 నిమిషాలు రుద్ది కడిగితే సబ్బు మరకలు, వాసన రెండూ పోతాయి.

45
టూత్‌పేస్ట్‌తో ట్రై చేయండి

టూత్ పేస్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది.  టూత్‌పేస్ట్‌ను కూడా ఉపయోగించి బకెట్లు తెల్లగా మారవచ్చు. మరకపై టూత్‌పేస్ట్‌ను బాగా రాయండి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దండి. ఈ పద్ధతి లేత పసుపు రంగు, చిన్న మరకలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది.

55
వేడినీళ్లు, ఉప్పు

బకెట్లు, మగ్గులపై పడే మరకలు చాలా పాతవి, మొండివి అయితే బకెట్ నిండా వేడినీళ్లు నింపాలి. అందులో రెండు నుంచి మూడు చెంచాల ఉప్పు కలపండి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత బ్రష్‌తో రుద్దండి. ఇలా చేయడం వల్ల మరకలు సులభంగా పోతాయి.

బకెట్ పై ఉన్న మొండి మరకలను శుభ్రం చేయడానికి మీరు బ్లీచింగ్ పౌడర్ నీళ్లను కూడా వాడొచ్చు. బ్లీచ్‌తో మరకలు సులభంగా పోతాయి.  అయితే బ్లీచింగ్ పొడితో శుభ్రం చేస్తున్నప్పుడు చేతికి గ్లవుజులు వేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories