డాబా స్టైల్ లో ఆలూ పరాటా కావాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీ. ముందుగా ఆలూ మిశ్రమం పూర్తిగా పొడిగా ఉండాలి. బంగాళాదుంపలను ఉడికించిన తర్వాత వాటిలో నీరు ఎక్కువగా ఉంటే స్టఫింగ్ మెత్తగా, తడిగా మారుతుంది. దాన్ని పిండిలో పెట్టి రోల్ చేసేటప్పుడు ఒత్తిడి పడి బయటకు వచ్చేస్తుంది. అందుకే ఉడికించిన ఆలూను బాగా మెదిపి, అందులో తడి లేకుండా చూసుకోవాలి. స్టఫింగ్ పొడిగా ఉంటే పిండిలో ఉంచడం, రోల్ చేయడం ఈజీ అవుతుంది.