Aloevera side effects: కలబందను అతిగా వాడితే అనర్థమే..

Published : Jan 28, 2022, 12:01 PM IST

Aloe vera side effects: కలబందను అతిగా ఉపయోగిస్తే ఒకటి కాదు రెండు కాదో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కలబంద వల్ల ఎటువంటి సమస్యలు రాకూడదన్నా దీన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు. ఈ కలబందను ఇష్టానుసారం ఉపయోగిస్తే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా.. 

PREV
16
Aloevera side effects: కలబందను అతిగా వాడితే అనర్థమే..

Aloe vera side effects: కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతి ఇంటికి ఒక్కటైనా ఈ మొక్క ఖచ్చితంగా ఉంటుంది. దివ్య ఔషదాలను కలిగున్న ఈ కలబంద చర్మ, కేశ సంరక్షణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మలబద్దకానికి, స్టమక్ లో వచ్చే అంటు వ్యాధులను నయం చేయడానికి కూడా ఈ కలబంద దివ్య ఔషదంలా ఉపయోగపడుతుంది. దందాల సంరక్షణలో, మెరిసే చర్మానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది కణుతులు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించగల గుణాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా కలబంద మధుమేహ రోగులకు బాగా ఉపయోగపడుతుంది.  రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించే గుణం ఈ కలబంద కలిగి ఉంటుంది. 

26

 ప్రస్తుతం కలబంద వాడకం కూడా బాగా పెరిగిపోయింది. చర్మ నిగారించడానికి, కేశాలు పట్టుకుచ్చులా మెరిసిపోవడానికి చాలా మంది వీటిని వాడటానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే మానవాళికి ఇంత మంచి చేసే కలబంద.. మరెన్నో అనర్థాలను కూడా కలిగిస్తుంది. కలబందను ఇష్టాను సారంగా ఉపయోగిస్తే డేంజర్ లో పడ్డట్టే. అందుకే దీన్ని వాడే ముందు వైద్యులను సంప్రదించాలి. మరి ఈ కలబందను అతిగా ఉపయోగిస్తే వచ్చే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

36

చర్మ నిగారింపు కోసం కలబంద గుజ్జును చాలా మంది వాడుతూ ఉంటారు. అయితే దీని తరచుగా చర్మానికి వాడితే స్కిన్ ఎలర్జీ వస్తుంది. అంతేకాదు చర్మంపై దద్దుర్లు కూడా వాస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మం ఎరుపు రంగులోకి మారే ప్రమాదం పొంచి ఉంది. కలబంద గుజ్జుతో చర్మంపై మర్దన చేస్తే దురద వంటి అనేక సమస్యలు వస్తాయి.
 

46

కలబందను చాలా మంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే ప్రతి రోజూ ఉదయం పూట ఈ కలబంద రసాన్ని తాగుతుంటారు. బరువు ఈజీగా తగ్గుతామని గ్లాసులకు గ్లాసుల కలబంద రసాన్ని తాగడం మనం చూస్తున్నదే. కానీ ప్రతి రోజూ ఇలా చేస్తే బాడీ డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు వికారం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
 

56


మంచిదని కలబందను రోజుల తరబడి నిత్యం తీసుకుంటే విరేచనాలు వస్తాయి. ఎందుకంటే ఆ రసంలో ఆంత్రాక్వినోన్ అనే  పదార్థం ఉండటం వల్ల అది క్రమేపీ విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులకు దారి తీస్తుంది.

66

కలబంద రసాన్ని బరువు తగ్గుతామని ఎక్కువ కాలం తీసుకుంటే మీరు ప్రమాదం పడ్డట్టే. ఎందుకంటే కలబందను ప్రతి నిత్యం తీసుకుంటే శరీరంలో పొటాషియం తగ్గే ప్రమాదం ఉంది. దీంతో మీరు తీవ్ర భయాందోళనకు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు బలహీనంగా కూడా మారిపోతారు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే కలబందను మోతాదుకు మించి తీసుకోకూడదు.  


 

Read more Photos on
click me!

Recommended Stories