All spice Plant: అన్ని రకాల మసాలాలు అవసరం లేదు.. ఇదొక్కటి వేస్తే చాలు చికెన్, మటన్ టేస్ట్ అదిరిపోద్ది

Published : Oct 26, 2026, 01:06 PM IST

All spice Plant: మనం చేసుకునే వంటల రుచి, సువాసన కోసం దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ వేసుకుంటుంటాం. కానీ ఇవేవీ వేయకుండా ఈ ఒక్క పొడి వేస్తే చాలు..వెజ్ గానీ, నాజ్ వెజ్ గానీ ఘాటు మసాలాతో ఘుమఘమలాడిపోతాయి. మరి ఆ పొడి ఏంటో? ఎక్కడ దొరుకుతుందో చూద్దాం.

PREV
15
ఇదొక్క పొడి వేస్తే చాలు వంటలు ఘుమఘుమలాడిపోతాయి

వంటల రుచి, సువాసన కోసం రకరకాల మసాలాలను ఉపయోగిస్తుంటాం. అయితే లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ వాసన వచ్చే ఒకే మొక్క నుంచి లభిస్తుందని తెలుసా? అంతేకాదు.. ఆ మొక్క నుంచి వచ్చే పండ్లను ఎండబెట్టి మసాలాగా ఉపయోగిస్తారు. ఇంటర్నేషనల్ వంటల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.. ఈ ఆల్‌స్పైస్. అసలు ఈ మొక్క ప్రత్యేకత ఏంటి? వంటల్లో ఎలా ఉపయోగిస్తారు? మన దేశంలోనూ పండిస్తున్నారా?

25
ఇదొక వెరైటీ మొక్క

ఆల్‌స్పైస్ (Allspice) అనేది Pimenta dioica అనే శాస్త్రీయ నామం కలిగిన మొక్క. ఇది కరేబియన్ దీవులు, మధ్య అమెరికా ప్రాంతాలకు చెందిన మొక్క. ముఖ్యంగా జమైకాలో దీని సాగు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీనిని జమైకా పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు నుంచి వచ్చే చిన్న బెర్రీలను పూర్తిగా పండకముందే కోసి ఎండబెడతారు. ఆ తర్వాత వాటిని గింజల రూపంలో లేదా పొడిగా చేసి వంటల్లో ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఎండిన పండ్ల నుంచి వచ్చే సువాసన లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ..ఈ మూడింటి స్మెల్ వస్తుంది.

35
విదేశీ వంటకాల్లో ఎందుకంత ప్రత్యేకం?

ఆల్‌స్పైస్‌కు అంతర్జాతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కరేబియన్ ప్రాంతంలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. జమైకన్ జెర్క్ మసాలా మిశ్రమంలో ఇది చాలా కీలకమైన ఇంగ్రీడియంట్. మాంసాహార వంటకాలు, సూప్‌లు, సాస్‌లు, పచ్చళ్లు, బేకరీ ఉత్పత్తుల్లోనూ దీనిని వినియోగిస్తారు.

కేకులు, కుకీలకు సువాసన అందించడంతో పాటు, నాన్ వెజ్ వంటలకు ఘాటైన ఫ్లేవర్‌ను అందిస్తుంది. గింజల రూపంలోనూ, పొడిగానూ ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో వివిధ రకాల వంటకాలకు ఇది సరిపోతుంది. నల్ల మిరియాలను పోలి ఉండే దీని ఎండిన పండ్లను చూసి చాలామంది రెండూ ఒకటే అనుకుంటారు. కానీ రెండూ వేర్వేరు.

45
ఆల్‌స్పైస్‌లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?

ఆల్‌స్పైస్‌లో యూజినాల్ (Eugenol) వంటి సుగంధ సమ్మేళనాలు ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబియల్ లక్షణాలపై పరిశోధనలు జరిగాయి. సంప్రదాయ వైద్య పద్ధతుల్లోనూ ఈ మసాలాను కొన్ని జీర్ణ సంబంధిత సమస్యల కోసం ఉపయోగించిన సందర్భాలున్నాయి. ఆల్‌స్పైస్ ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా తీసుకోకండి.

55
మన దేశంలోనూ సాగు చేయవచ్చా?

ఆల్‌స్పైస్ మొక్క వేడి, తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతుంది. నీరు నిల్వ ఉండని సారవంతమైన నేల దీనికి అనుకూలం. భారతదేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచుతున్నారు. అయితే వాణిజ్య స్థాయిలో సాగు చేయాలంటే వాతావరణం, మొక్కల ఎంపిక, పండ్ల దిగుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చెట్టు అనుకూల పరిస్థితుల్లో సుమారు 7 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు పెరగవచ్చు. పండ్ల దిగుబడి కోసం సరైన మొక్కలను ఎంచుకోవడం కూడా ముఖ్యం. అందువల్ల సాగు చేయాలనుకునేవారు ముందుగా స్థానిక ఉద్యానవన శాఖ లేదా సుగంధ ద్రవ్యాల నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఒకే మొక్క నుంచి లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయలను గుర్తుచేసే సువాసన రావడమే ఆల్‌స్పైస్ ప్రత్యేకత.

Read more Photos on
click me!

Recommended Stories