Potato Papad: క్రిస్పీ బంగాళాదుంప అప్పడాలు.. ఇంట్లో సులువుగా ఇలా చేసేయండి

Published : Oct 26, 2026, 12:19 PM IST

Potato Papad: బంగాళాదుంపలతో చిప్స్ లాగే అప్పడాలు కూడా చేసుకోవచ్చు. పప్పు, సాంబారుతో వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఇంట్లో చాలా సులువుగా ఎలా చేయాలో రెసిపీ తెలుసుకోండి.

PREV
13
బంగాళాదుంప అప్పడాల రెసిపీ

పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే బంగాళాదుంప అప్పడాలను ఇంట్లోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. వీటిని కొందామంటే బయట దొరకవు. ఇంట్లోనే చేసుకోవాలి. వీటి రెసిపీ ఎంతో సులువు.

23
బంగాళాదుంప అప్పడాలకు కావాల్సిన పదార్థాలు

పెద్ద బంగాళాదుంపలు – మూడు

ఎండుమిర్చి తురుము – 2 చెంచాలు

నూనె – 1 టీస్పూన్

ఉప్పు – తగినంత

33
బంగాళాదుంప అప్పడాల రెసిపీ

1. ముందుగా బంగాళాదుంపలను కుక్కర్‌లో లేదా గిన్నెలో మెత్తగా ఉడికించి, చల్లారాక పొట్టు తీయాలి.

2. ఉడికించిన దుంపలను ఒక వెడల్పాటి గిన్నెలో వేసి ఉండలు లేకుండా చేత్తో బాగా మెదపాలి. అందులో సరిపడా ఉప్పు, ఎండుమిర్చి తురుము, అర చెంచా నూనె వేసి ముద్దలా కలపాలి.

3. ఒక ప్లాస్టిక్ కవరుపై కొద్దిగా నూనె రాయాలి. చిన్న పిండి ముద్దను తీసుకుని ఆ కవరుపై పెట్టి, చేతి వేళ్ళతో గుండ్రంగా అప్పడంలా పల్చగా ఒత్తుకోవాలి.

4 ఒత్తిన అప్పడాలను ఒక కాటన్ చీరపై లేదా పెద్ద పళ్లెంలో వరుసగా వేయాలి. వీటిని ఎండలో రెండు రోజుల పాటు బాగా పెళుసుగా మారేంతవరకు ఆరబెట్టాలి.

5. పూర్తిగా ఎండిన తర్వాత వీటిని గాలి తగలని డబ్బాలో భద్రపరుచుకోవాలి.

6. తినాలనిపించినప్పుడు వేడి నూనెలో వేస్తే కరకరలాడే టేస్టీ అప్పడాలు రెడీ అవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories