Alcohol: విస్కీ తాగేప్పుడు స్వీట్స్ తింటే ఏమ‌వుతుందో తెలుసా.? శ‌రీరంలో జ‌రిగే మార్పులివే

Published : Feb 20, 2026, 03:42 PM IST

Alcohol: సాధార‌ణంగా బీర్ లేదా విస్కీ తాగే స‌మ‌యంలో చాలా మంది చాలా మంది పల్లీలు, ఫ్రై చేసిన స్నాక్స్, లేదా నాన్ వెజ్ తీసుకుంటారు. అయితే కొంద‌రు స్వీట్స్ కూడా తింటుంటారు. ఇంత‌కీ ఆల్క‌హాల్ తీసుకునే స‌మ‌యంలో తినే ఆహారం ఎలాంటి ప్ర‌భావం చూపుతుందంటే. 

PREV
15
ఆల్క‌హాల్ శ‌రీరంలో ఏం చేస్తుంది.?

మందు తాగిన తర్వాత అది నేరుగా కడుపు, చిన్న పేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన తర్వాత అది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలో ఆల్క‌హాల్‌ స్థాయి (Blood Alcohol Concentration - BAC) పెరిగితే మత్తు ఎక్కువగా అనిపిస్తుంది. కడుపు ఖాళీగా ఉంటే ఆల్కహాల్ త్వరగా రక్తంలోకి చేరుతుంది. కడుపులో ఆహారం ఉంటే ఆల్క‌హాల్ నెమ్మ‌దిగా జీర్ణ‌మ‌వుతుంది. అందుకే మందు తాగే ముందు లేదా తాగేటప్పుడు ఏదైనా తినడం మంచిదని వైద్యులు చెబుతారు.

25
ఆల్క‌హాల్‌తో ఈ ప‌దార్థాలే ఎందుకు.?

సాధార‌ణంగా ఆల్క‌హాల్ తీసుకునే స‌మ‌యంలో ఉప్పు ఎక్కువ‌గా ఉండే పల్లీలు, చిప్స్, మిక్స్చర్ వంటి పదార్థాలు తీసుకుంటారు. దీనికి కార‌ణం ఉప్పు ఉన్న ఆహారం తింటే దాహం పెరుగుతుంది. దాహం పెరిగితే ఆల్కహాల్ లేదా నీళ్లు ఎక్కువగా తాగుతారు. ఉప్పు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యాన్ని కొంతవరకు నిలబెడుతుంది. కొవ్వు, ప్రోటీన్ ఉన్న స్నాక్స్ కడుపులో ఉండటం వల్ల ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లే వేగం తగ్గుతుంది. ఖాళీ కడుపుతో మందు  తాగితే వచ్చే తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అంటే ఇవి కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆల్క‌హాల్‌ ప్రభావాన్ని కొంత నెమ్మదించడంలో కూడా సహాయపడుతుంది.

35
ఆల్కహాల్ తో స్వీట్స్ తింటే ఏమవుతుంది?

ఆల్క‌హాల్ తాగేప్పుడు స్వీట్స్ తింటే మ‌త్తు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చాలా మంది భావిస్తుంటారు. అయితే శాస్త్రీయంగా చూస్తే స్వీట్స్‌లో చక్కెర (గ్లూకోజ్) ఎక్కువగా ఉంటుంది. చక్కెర త్వరగా జీర్ణమై రక్తంలోకి చేరుతుంది. ఆల్క‌హాల్ కూడా రక్తంలోకి త్వరగా చేరుతుంది. ఇవి రెండూ కలిస్తే.. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగి, తర్వాత త్వరగా పడిపోవచ్చు. దీనివల్ల తలనొప్పి, అలసట, ఎక్కువ మత్తు అనిపించవచ్చు. స్వీట్ డ్రింక్స్, సోడా కలిపిన ఆల్కహాల్ (కాక్టెయిల్స్) తాగితే మందు ప్రభావం త్వరగా అనిపిస్తుంది. కొన్ని పరిశోధనల్లో కార్బొనేటెడ్ డ్రింక్స్ (సోడా) కలిపితే ఆల్కహాల్ రక్తంలోకి వేగంగా చేరుతుందని చెప్పారు. అందుకే స్వీట్ కాక్‌టెయిల్స్ తాగితే త్వరగా మత్తు వచ్చినట్టు అనిపిస్తుంది.

45
సోడా, స్వీట్ డ్రింక్స్ ఎందుకు త్వరగా మత్తు కలిగిస్తాయి?

సోడాలో గాలి (కార్బన్ డయాక్సైడ్) ఉంటుంది. ఇది కడుపులో ఒత్తిడిని పెంచుతుంది. దీంతో కడుపు త్వరగా ఖాళీ అవుతుంది. ఆల్కహాల్ చిన్న పేగులోకి త్వరగా చేరుతుంది. అక్కడి నుంచి రక్తంలోకి వేగంగా కలుస్తుంది. అందుకే బీర్, స్వీట్ కాక్‌టెయిల్స్, సోడా కలిపిన డ్రింక్స్ తాగితే మత్తు త్వరగా వచ్చినట్టు అనిపిస్తుంది.

55
ఏది మంచిది?

ఎలా తీసుకున్న ఆల్క‌హాల్ ఆరోగ్యానికి హానికరం. అయినా తాగేవారు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

* ఖాళీ కడుపుతో తాగకూడదు.

* ప్రోటీన్, కొవ్వు ఉన్న ఆహారం తినాలి.

* ఎక్కువ చక్కెర ఉన్న డ్రింక్స్ తగ్గించాలి.

* మధ్య మధ్యలో నీళ్లు తాగాలి.

* పరిమితిలో మాత్రమే ఆల్కహాల్ తీసుకోవాలి.

స్వీట్స్ తింటే మ‌త్తు ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని చెప్పడం పూర్తిగా సరైంది కాదు. కానీ చక్కెర, సోడా కలిపితే మందు ప్రభావం త్వరగా అనిపించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories