Paris Fashion Week : తెల్లటి దుస్తుల్లో అదరగొట్టిన అందాల ఐశ్యర్య రాయ్...

Published : Oct 04, 2021, 11:03 AM ISTUpdated : Oct 04, 2021, 03:09 PM IST

పారిస్ లో జరుగుతున్న ఐశ్వర్య పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై హోయలొలుకబోసింది. తెల్లటి దుస్తుల్లో దివినుంచి దిగివచ్చిన దేవకాంతలా అభిమానులను తన మనోహరమైన రూపంతో ఆశ్చర్యపరిచింది. పాలవన్నెలాంటి తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ చూపరులను ఆశ్చర్యపరిచింది.

PREV
16
Paris Fashion Week : తెల్లటి దుస్తుల్లో అదరగొట్టిన అందాల ఐశ్యర్య రాయ్...
Aishwarya Rai Bachchan stuns at Paris Fashion Week

ప్రపంచసుందరి ఐశ్యర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచసుందరిగానే కాదు... నటిగా, మాతృమూర్తిగా, భార్యగా ఆమె సక్సెస్ ఫుల్ ఉమెన్గా నిరూపించుకుంది. వయసు పెరిగినా వన్నె తగ్గని అందం తన సొంతం అని నిరూపించుకుంటోంది. 

26
Aishwarya Rai Bachchan stuns at Paris Fashion Week

తాజాగా పారిస్ లో జరుగుతున్న ఐశ్వర్య పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై హోయలొలుకబోసింది. తెల్లటి దుస్తుల్లో దివినుంచి దిగివచ్చిన దేవకాంతలా అభిమానులను తన మనోహరమైన రూపంతో ఆశ్చర్యపరిచింది. పాలవన్నెలాంటి తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ చూపరులను ఆశ్చర్యపరిచింది.

36
Aishwarya Rai Bachchan stuns at Paris Fashion Week

అందానికి తగిన చక్కటి వ్యక్తిత్వం ఐశ్యర్య సొంతం. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య తన డ్రెస్ కు తగ్గట్టుగా ఫ్యూషియా లిప్‌స్టిక్‌ని ఎంచుకుంది. జుట్టును సైడ్ పార్ట్ వేవ్స్‌లో స్టైల్ చేయించింది. దీంతో ఐశ్యర్య డ్రెస్సింగ్ మరింత వన్నె తేలింది. 

46
Aishwarya Rai Bachchan stuns at Paris Fashion Week

పారిస్ ఫ్యాషన్ వీక్‌ ను పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ వేదికగా నిర్వహించారు. ఈ ర్యాంప్ వాక్ లో లోరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్లయిన అందాల సుందరాంగులందరూ ర్యాంప్‌లో నడిచారు.

56
Aishwarya Rai Bachchan stuns at Paris Fashion Week

ఆమె ర్యాంప్‌పై సాంటర్ చేస్తున్నప్పుడు అక్కడో దవళవర్ణ శోభితం నిలుచున్నట్టుగా అనిపించింది. పూర్తిగా ర్యాంప్ ను తన కైవసం చేసుకుంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె లుక్స్‌ని  అభిమానులు ప్రశంసించకుండా ఉండలేకపోయారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్యను ఇలా చూడడం తమకు చాలా సంతోషంగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

66
Aishwarya Rai Bachchan stuns at Paris Fashion Week

అందార రాశులంతా ఒక్క దగ్గర పోగవ్వడంతో.. ఆ ప్రాంతం అంతా కాంతులతో నిండిపోయింది. ఆకాశంలోని తారలన్నీ ఒక్క దగ్గరే గుమిగూడాయా అన్నట్టుగా అందం చిందులు వేసింది. ఐశ్వర్య ఫైనల్ బో తీసుకునే సమయంలో ర్యాంప్ వద్ద హెలెన్ మిర్రెన్, అంబర్ హర్డ్ పాల్గొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories