Korean Bowl Set: కిచెన్‌కు రాయల్ లుక్.. 200కే కొరియన్ బౌల్స్ సెట్.. అదిరిపోలా

Published : Apr 18, 2026, 06:11 PM IST

Korean Bowl Set: కిచెన్ రాయల్ లుక్‍తో మెరిసిపోవాలా? జస్ట్ రూ.200 చాలు. ఈ ట్రెండింగ్ కొరియన్ బౌల్ సెట్‍తో మీ వంటగదిని ఎలిగెంట్‍గా మార్చేయొచ్చు. చూడటానికి క్యూట్‌గా, పేస్టల్ రంగుల్లో ఉంటాయి. మీ కిచెన్‌కు K-POP స్టైల్‌లో మోడ్రన్ లుక్ ఇస్తాయి.

PREV
16
కోరియన్ బౌల్ సెట్ ప్రత్యేకతలు
కొరియన్ బౌల్ సెట్స్ మన దగ్గర ఉండే బోన్ చైనా సెట్స్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి సింపుల్, క్లీన్, సాఫ్ట్ కలర్ టోన్స్‌తో ఆకట్టుకుంటాయి. మోడ్రన్ కిచెన్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. వీటిని నూడుల్స్, రైస్, సూప్, సలాడ్.. ఇలా దేనికైనా వాడుకోవచ్చు.
26
మల్టీ కలర్ కోరియన్ బౌల్ సెట్
కొరియన్ బౌల్ సెట్స్‌లో మీరు ఇలాంటి మల్టీ కలర్ ప్యాటర్న్‌ను కూడా ఎంచుకోవచ్చు. వీటికి రెండు వైపులా హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇందులో నీలం, పసుపు, ఆరెంజ్ వంటి బ్రైట్ రంగులను ఉపయోగించారు.
36
పోల్కా డాట్ డిజైన్ బౌల్ సెట్
బౌల్ సెట్స్‌లో పోల్కా డాట్ ప్రింట్ చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల కోసం మీరు మూత, హ్యాండిల్స్ ఉన్న ఇలాంటి బౌల్స్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో సూప్, పప్పు అన్నం, కిచిడీ, పాస్తా, బిర్యానీ వంటివి సర్వ్ చేయొచ్చు.
46
ఫ్రూట్ షేప్ బౌల్స్
పిల్లల కోసం ఇలా పుచ్చకాయ ఆకారంలో ఉన్న కొరియన్ బౌల్‌ను 100-150 రూపాయలకే కొనొచ్చు. దీని బయటి వైపు ఆకుపచ్చ రంగు, లోపల ఎరుపు రంగు బేస్‌పై నల్ల చుక్కలు ఉంటాయి. ఇది చూడటానికి అచ్చం పుచ్చకాయలా కనిపిస్తుంది.
56
మినీ కోరియన్ బౌల్ సెట్
టొమాటో సాస్, కెచప్, సోయా సాస్ వంటివి పెట్టుకోవడానికి మీరు ఇలాంటి చిన్న కొరియన్ బౌల్ సెట్స్ కొనొచ్చు. వీటికి చిన్న హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. చైనీస్ ఫుడ్‌తో పాటు సాస్‌లు సర్వ్ చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు.
66
ఫ్లోరల్ ప్రింట్ కోరియన్ బౌల్ సెట్
కొరియన్ బౌల్ సెట్స్‌లో ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ చాలా ట్రెండీగా ఉంది. ఇందులో తెలుపు రంగు సిరామిక్ పాట్స్, ప్లేట్లపై 3D ఫ్లోరల్ డిజైన్ చేస్తారు.
Read more Photos on
click me!

Recommended Stories