కూరగాయల మాదిరిగానే పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, సెలీనియం, పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను, ఊపిరితిత్తులను, జీర్ణాశయాన్ని, మూత్రపిండాలను, కండ్లతో సహా.. శరీరంలోని మొత్తం శరీర భాగాలను హెల్తీగా ఉంచుతాయి. అందుకే ప్రతిరోజూ రెండు మూడు రకాల పండ్లనైనా తినాలని డాక్టర్లు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా సీజనల్ పండ్లను మిస్ కాకుండా తినాలి. ఆయుర్వేదం ప్రకారం.. ఖాళీ కడుపుతో పండ్లను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 10 గంటల సమయంలో కఫం ఎక్కువగా ఉంటుంది.