ఈ తప్పులు చేయకుంటే.. 2023లో మీరే ధనవంతులు...

First Published Dec 13, 2022, 11:26 AM IST

సంపాదించడం వల్లే ధనవంతులు కాదు. సంపాదించిన దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి. ఆదాయంతో పాటు ఖర్చు, పొదుపు.. పెట్టుబడులు తెలిసి ఉండాలి. ఈ నూతన సంవత్సరం అలాంటి టిప్స్ మీ కోసం.. 

సమృద్ధి
మీరు సంపాదిస్తున్న దాంతో సంతృప్తి చెందడం మంచిదే. కానీ అంతటితో ఆగిపోకండి.. ఇప్పటికే చాలా సంపాదించేశా అని.. సంపాదించడం ఆపేయకండి. మీ దగ్గరున్న డబ్బు ఇప్పటి మీ అవసరాలు తీర్చచ్చు..కానీ సమృద్ధికి ప్రయత్నించండి. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఎవరిమీదా ఆధారపడకుండా ఉండొచ్చు. 

అనేక మార్గాలు
డబ్బు సంపాదనకు అనేక మార్గాలు. అందుకే సంపాదించిన దాన్ని వేరే వేరే మార్గాల్లో మదుపు చేయడం ద్వారా.. వాటినుంచి వచ్చే ఆధాయం మీకు ఒకే సంపాదనలా కాకుండా.. ఆదాయ మార్గాలను పెంచుతుంది. దీనికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ మెంట్లు ప్లాన్ చేయండి.

పోల్చుకోకండి
మిగతా వారి సంపాదనతో మీ సంపాదనను ఎప్పుడూ పోల్చుకోకండి. దీనివల్ల మీరు ఫీల్ అవుతారు తప్పితే పెద్దగా ప్రయోజనం ఉండదు.

కొత్త వస్తువులు
ప్రతీ రోజూ మార్కెట్లో ఏదో ఓ కొత్త వస్తువు వస్తూనే ఉంటుంది. రకరకాల గాడ్జెట్లు అందుబాటులో ఉంటున్నాయి. కొత్త టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసి మిమ్మల్ని మీరు రిచ్ గా ఫీల్ అవ్వకండి. ఆ వస్తువు మీకు ఎంతవరకు అవసరం అని పూర్తిగా తెలుసుకున్న తరువాతే కొనండి.

నమ్మకం
డబ్బుల విషయంలో, పెట్టుబడుల విషయంలో అంత తొందగా ఎవ్వరినీ నమ్మకండి. ఆర్థిక భాగస్వామిగా మారేముందు, దేంట్లోనైనా పెట్టుబడులు పెట్టేముందు.. స్వయంగా మీరే దాని గురించి పూర్తి అవగాహన కల్పించుకోండి. ఆ తరువాతే అందులోకి దిగండి.

పెట్టుబడులు
పొదుపు చేయడం వల్ల ధనవంతులు కావడం అందరికీ తెలిసిందే. అయితే సరైన సమయంలో.. సరైన దాంట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీ భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టుగా అవి మిమ్మల్ని ఆదుకుంటాయి. అది తెలుసుకుని పెట్టాలి.

రుణాలు
చేసిన అప్పులు, లోన్లు వీలైనంత త్వరగా తీర్చడానికి ప్రయత్నించండి. లేకపోతే జీవితకాలం లోన్లు కట్టడంలోనే ముగిసిపోతుంది. 

ప్రదర్శన వద్దు
మీరు ధనవంతులని నలుగురూ అనుకోవాలని.. ఉన్నా, లేకున్నా చూపించుకోవాలనుకోవడం సరికాదు. దీనికోసం చాలామంది అవసరం ఉన్నా, లేకున్నా.. ఖరీధైన వస్తువులు, గాడ్జెట్స్, వాహనాలు కొంటుంటారు. దీనివల్ల మీ జేబుకు చిల్లు పడడం తప్ప వేరే ఉపయోగం లేదు.

ఖర్చు
మీ సంపాదనను మించి మీ ఖర్చు ఉందా? పరిశీలించండి.. అలా ఉన్నట్లైతే.. మీరు చిక్కుల్లో పడ్డట్లే..మీ ఆర్థిక స్థితి.. గందరగోళంలో పడ్డట్టే. 

click me!