బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెండకాయ కోసేటప్పుడే జిగురుగా అనిపిస్తుంది. ఇది చాలామందికి చికాకు తెప్పిస్తుంది. ఈ జిగురు వల్ల వేపుడు పొడి పొడిగా కూడా రాదు. దీని వల్ల రుచి పోతుంది. బెండకాయ ముక్కలన్నీ అతుక్కుపోయి ముద్దలా వేపుడు వస్తుంది. ఇకపై బెండకాయ వేపుడు పొడిపొడిగా రావాలంటే హోటల్ స్టైల్‌లో ఈ అద్భుతమైన చిట్కాలను ఫాలో అవ్వండి.
25
తడి లేకుండా
బెండకాయలను కడిగిన వెంటనే తరగవద్దు. కడిగాక వాటిని పొడి బట్టతో తుడిచి ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టండి. నీటి తడి ఉంటే కోసినప్పుడు బెండకాయల నుంచి జిగురు ఎక్కువగా వస్తుంది. అలాగే, బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కోస్తే జిగురు ఎక్కువగా వస్తుంది. అందుకే ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి.
35
నిమ్మరసం లేదా పెరుగు
బెండకాయలు వేపుడు చేయాలంటే కూర వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం, ఆమ్‌చూర్ పౌడర్ లేదా పెరుగు కలపండి. అవును కూర మగ్గుతున్నప్పుడు ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా ఒక చెంచా పెరుగు వేస్తే, వాటిలోని ఆమ్ల గుణం (acid) బెండకాయ జిగురును వెంటనే పోతుంది.
చాలామంది వంట మొదట్లోనే ఉప్పును వేసి కలిపేస్తారు. కానీ బెండకాయ వేపుడు లేదా కూర వండినప్పుడు మాత్రం ముందుగా ఉప్పు వేయకూడదు. ఉప్పు వేయడం వల్ల తేమను విడుదల చేసి జిగురును పెంచుతుంది. అందుకే కూర 90 శాతం ఉడికిన తర్వాతే ఉప్పును వేయండి. అలాగే కళాయి నిండా ముక్కలు వేయొద్దు. గాలి ఆడేంత ఖాళీ ఉండేలా చూసుకోండి.
55
మూత పెట్టకండి
బెండకాయ వేపుడు చేసేటప్పుడు బాణలిపై మూత పెట్టకూడదు. మూత పెడితే కూర ముద్దగా మారుతుంది. దీనివల్ల ముక్కలు మెత్తబడి జిగురు వస్తుంది. అందుకే మూత తీసే వండండి. బెండకాయలు వేసిన తర్వాత పదేపదే గరిటెతో తిప్పకండి. ఎక్కువగా కలిపితే ముక్కలు విరిగిపోయి, గింజలు, జిగురు బయటకు వస్తాయి.
బెండకాయలు కోసేటప్పుడు కత్తికి కొద్దిగా నిమ్మరసం రాయండి. దీనివల్ల కోసేటప్పుడు కత్తికి జిగురు అంటుకోదు. పని కూడా చకచకా అయిపోతుంది!