అన్నం తక్కువ తినడమే మంచిది.. ఎందుకంటే..

Published : Oct 31, 2022, 01:58 PM IST

కార్భోహైడ్రేట్లు బరువు పెరగడానికి దారితీస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు  అన్నాన్ని తక్కువగా తినాలి. ఎందుకంటే అన్నంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.   

PREV
17
 అన్నం తక్కువ తినడమే మంచిది.. ఎందుకంటే..

మన దేశంలో ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే అన్నాన్నే ఎక్కువగా తింటుంటారు. అది కూడా మూడు పూటలా. అన్నమే ఆహారంగా భావిస్తారు. కానీ ఈ ఆహారం వల్ల మన శరీరానికి అందే పోషకాలు చాలా తక్కువే. అసలు దీనిలో మన శరీరానికి అవసరమ్యే పోషకాలే ఉండవు. అందుకే అన్నం తక్కువ, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలని చెప్తుంటారు డాక్టర్లు, నిపుణులు. కానీ ఈ పద్దతిని ఫాలో అయ్యే వారు అస్సలు ఉండరేమో. బియ్యంలో కార్బోహైడ్రేట్లే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి (చక్కెర) విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు బియ్యాన్ని తక్కువగా తినమని సలహానిస్తుంటారు. 

27

మీకు తెలుసా.. కార్బోహైడ్రేట్లు కూడా బరువు పెరగడానికి దారితీస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకున్న వాళ్లు కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. అంటే అన్నం కూడా తక్కువగా తినాలన్న మాట. ఎందుకంటే అన్నంలో కూడా కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి. 
 

 

37
rice

ఊబకాయులు లేదా అధిక బరువు ఉన్నవారు, డయాబెటీస్ పేషెంట్లు మాత్రమే కాకుండా.. ఇతరులు కూడా బియ్యంతో సహా పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

47

ఏదేమైనా..  కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్ వ్యాధి బారిన పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడిస్తోంది. జామా నెట్వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికాలోని లూసియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

57

డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక గ్రూప్ ని తక్కువ కార్భోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని, మరొక గ్రూప్ సాధారణ ఆహారాన్ని తీసుకోమని సిఫారసు చేశారు. ఆరు నెలల తరువాత.. సాధారణ ఆహారాన్ని తినేవారికి మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కనుగొన్నారు.

67

అయితే ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. కార్భోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించడం వల్ల ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనం వెల్లడిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. ఖచ్చితంగా కార్భోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలని గుర్తుంచుకోండి. 
 

77

మొత్తంలో అన్నం తక్కువ చేయడం వల్ల  శరీరంలో రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా అజీర్థి, మలబద్దకం, వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. మీరు చదివారో లేదో కానీ.. సెలబ్రిటీలు అన్నాన్ని చాలా అంటే చాలా తక్కువగా తింటుంటారు. కూరగాయలు, పండ్లు, సలాడ్లు, జ్యూస్ లనే ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్లే ఆరోగ్యంగా ఉంటామన్న ముచ్చట వాళ్లకు తెలుసు కాబట్టి. 
 

Read more Photos on
click me!

Recommended Stories