భారీ ఆహారాలు, స్వీట్లను తినడం, మధ్య మధ్యలో అల్పాహారాన్ని తినడం, రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, పొద్దున్న లేట్ గా లేవడం, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వంటి అలవాట్లను మానుకోవాలి. అలాగే ప్రాసెస్ చేసిన, చల్లని, ప్రీ ప్యాక్ చేయబడ్డ, ఫ్లేవర్లు, మసాలాలు ఎక్కువగా ఉండే, వేయించిన, ఎక్కువ చక్కెర, ఉప్పు ఉండే ఆహారాలను అసలే తినకూడదు. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు తియ్యని రసాలు, కార్భోనేటెడ్ పానయాలు, మద్యానికి దూరంగా ఉండాలి.