కేఫ్ లో రుచి... ఇంట్లో కాఫీలోనూ రావాలంటే..?

First Published | Oct 31, 2022, 12:48 PM IST

తాజా కాఫీ గింజలను గ్రౌండింగ్ చేయడం ద్వారా.. మీ కాఫీ చాలా రుచిగా, కమ్మని వాసనలు వెదజిమ్మేలా తయారు చేసుకోవచ్చు. కాపీ పొడి బయట కొన్నదాని కంటే కూడా.. ఇలా మీరు చేసుకోవడం వల్ల ఎక్కువ రుచి లభిస్తుంది.

coffee

ఉదయం లేవగానే కమ్మని ఒక కప్పు కాఫీ తాగితే కలిగే ఉత్సాహమే వేరు. అయితే.. చాలా మందికి బయట కేఫ్ లో తాగిన రుచి.. ఇంట్లో కాఫీ కి అస్సలు రాదు. అందుకే... బయట తాగడానికే ఇష్టపడతారు. కానీ.. బయట కేఫ్ లోకాఫీ తాగాలంటే ఖర్చుతూ కూడుకున్న పని కాబట్టి... ఇంట్లో.. కేఫ్ రుచి వచ్చేలా ప్రయత్నించవచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం...

coffee

హోల్ బీన్ కాఫీని వాడండి...
చాలా మంది ఇంట్లో బయట తయారు చేసిన కాఫీ పొడిని కొనుక్కోని వచ్చి కాఫీ చేసుకుంటారు. కానీ కేఫ్ రుచి రావాలంటే.... కాఫీ పౌడర్ కాకుండా.. హోల్ బీన్ కాఫీ ని ఎంచుకోవాలి. తర్వాత... దీనిని గ్రైండ్ చేసుకొని కాఫీకి ఉపయోగించాలి. తాజా కాఫీ గింజలను గ్రౌండింగ్ చేయడం ద్వారా.. మీ కాఫీ చాలా రుచిగా, కమ్మని వాసనలు వెదజిమ్మేలా తయారు చేసుకోవచ్చు. కాపీ పొడి బయట కొన్నదాని కంటే కూడా.. ఇలా మీరు చేసుకోవడం వల్ల ఎక్కువ రుచి లభిస్తుంది.

Latest Videos


coffee

ఇక మీరు కాఫీ తయారు చేసే సమయంలో మీరు ఉపయోగించే నీరు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాఫీ తయారు చేసే సమయంలో... నాణ్యత ఎక్కువగా ఉన్న నీటిని ఉపయోగించాలి. ఏదైనా సరైన నీటిని ఉపయోగించకుంటే.. వాటి వాసనలు కాఫీ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.కాబట్టి... కాఫీ రుచిగా ఉండాలి అంటే.. శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి.


ఇక నీటిని కాచే క్రమంలో ఉపయోగించే ఉష్ణోగ్రత కూడా కీలకమే. కాఫీ కాచే సమయంలో 92-95 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత వద్ద కాఫీ వేడి చేయడం వల్ల అనవసరమైన చేదు రుచులను వెలికితీయకుండా మన కాఫీలలోని రుచి మాత్రమే బయటకు వస్తుంది.

coffee

మీ కాఫీ మెషీన్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల సాధారణ పరిశుభ్రతను అందించడం, మీ కాఫీ రుచిని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు  ఉన్నాయి.

బ్రూయింగ్ రబ్బరు పట్టీల్లో తరచుగా పాత,కాల్చిన కాఫీని పేరుకుపోతాయి, ఇది కాఫీ తయారీ ప్రక్రియలో రుచిని ప్రభావితం చేస్తుంది, ఇది పుల్లని, చేదు లేదా లోహ రుచిని కలిగిస్తుంది. కాబట్టి కాఫీ మెషిన్ ని ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

Viral pic of a hot cup of filter coffee has confused the Internet. Zoom in for a surprise

కాఫీ గింజలను ఎల్లప్పుడూ గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. గ్లాస్ క్యానింగ్ జాడిలు లేదా రబ్బరు-గ్యాస్కెట్ సీల్స్‌తో కూడిన సిరామిక్ స్టోరేజ్ క్రాక్స్ మంచి ఎంపికలు. కాల్చిన కాఫీ గింజలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచవద్దు 

click me!