చిప్స్ ప్యాకెట్ ని గాలితో ఎందుకు నింపుతారు? గాలి ఉన్నా చిప్స్ ఎందుకు మెత్తబడవు..?

Published : Oct 06, 2026, 10:10 AM IST

మార్కెట్లో మనం ఎలాంటి చిప్స్ ప్యాకెట్ కొన్నా కూడా... చూడటానికి హెవీగా కనిపిస్తుంది. తీరా ఓపెన్ చేస్తే సగం చిప్సే ఉంటాయి. అంతేకాదు.. గాలితో నింపినా కూడా చిప్స్ కరకరలాడుతూ ఎలా ఉంటాయి?

PREV
12
చిప్స్ ప్యాకెట్ లో గాలి నింపడం వెనక సీక్రెట్ ఇదే..

దుకాణానికి వెళ్తాం.. రూ.20 పెట్టి ఒక క్రిస్పీ చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటాం. ప్యాకెట్ సైజ్ చూస్తే ఫుల్‌గా ఉబ్బిపోయి పెద్దదిగా కనిపిస్తుంది. "వావ్, నిండా చిప్స్ ఉన్నాయ్" అనుకుంటూ ఎంతో ఆశగా ప్యాకెట్ తెరిచి చూస్తే.. లోపల కనపడేది కేవలం గుప్పెడు చిప్స్ మాత్రమే. మిగతాదంతా ఖాళీ స్థలమే.

ఇది చూసిన ప్రతిసారీ మనకు వచ్చే కోపం ఒక్కటే.. "కంపెనీ వాళ్ళు మన డబ్బులతో మనకే టోపీ పెడుతున్నారు, గాలిని అమ్ముతూ భారీగా మోసం చేస్తున్నారు" అని తిట్టుకుంటాం. కానీ, అసలు నిజం ఏమిటో తెలిస్తే మీరు మీ అభిప్రాయాన్ని క్షణంలో మార్చుకుంటారు. చిప్స్ ప్యాకెట్‌లో ఆ గాలి ఉండటం వెనుక ఒక పెద్ద సైన్స్, దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

22
అసలు ఆ ప్యాకెట్లలో నింపేది సాధారణ గాలినా?

మనం పీల్చే ఆక్సిజన్ గాలిని కనుక చిప్స్ ప్యాకెట్‌లో నింపితే, ఆ చిప్స్ ఒక్క రోజు కూడా నిలవవు. గాలి తగిలి మెత్తగా అయిపోయి, పాచిపోయిన వాసన వస్తాయి. అందుకే కంపెనీలు ప్యాకెట్లలో నింపేది ‘నైట్రోజన్ గ్యాస్’.

ఈ నైట్రోజన్ గ్యాస్ వల్ల మనకు కలిగే లాభాలు ఇవే:

కరకరలాడే రుచికి భరోసా: చిప్స్ ఎప్పటికీ తాజాగా, గుప్పెట్లో వేస్తే కరకరలాడేలా ఉండేందుకు ఈ గ్యాస్ అద్భుతంగా పనిచేస్తుంది.

ట్రావెలింగ్ సేఫ్టీ : ఫ్యాక్టరీ నుండి కంటైనర్లలో, అక్కడి నుంచి దుకాణాలకు.. ఆ తర్వాత మన చేతికి చేరే వరకు చిప్స్ ప్యాకెట్లు ఎన్నో ప్రయాణాలు చేయాలి. దారిలో ప్యాకెట్లు ఒకదానిపై ఒకటి పడినప్పుడు చిప్స్ అన్నీ ముక్కలై పౌడర్ అయిపోకుండా.. ఈ నైట్రోజన్ గ్యాస్ ఒక 'సాఫ్ట్ కుషన్'లా అడ్డుపడి చిప్స్‌ను కాపాడుతుంది.

సురక్షితమైన రక్షణ: ఆక్సిజన్‌ను తొలగించి నైట్రోజన్ నింపడం వల్ల ఆహారం బ్యాక్టీరియా బారిన పడకుండా, ఎలాంటి హాని చేయకుండా సురక్షితంగా ఉంటుంది. ఇది పూర్తిగా వాసన, రంగు లేని గ్యాస్.

మరి సగం ప్యాకెట్టే ఎందుకు ఇస్తున్నారు? "మరి సగం ప్యాకెట్ ఖాళీగా ఎందుకు ఉంటుంది?" అనే మీ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది! కంపెనీలు ఏనాడూ గాలిని బరువు లెక్కన అమ్మవు. ప్యాకెట్ మీద ముద్రించిన గ్రాముల బరువు (Net Weight) ప్రకారమే మీకు చిప్స్ తూకం వేసి ఇస్తారు.

చిప్స్ అన్నీ నలిగిపోకుండా, విరిగిపోకుండా సురక్షితంగా ఉండాలంటే ప్యాకెట్‌లో కొంత ఖాళీ స్థలం (గాలి) ఉండటం అత్యంత ఖచ్చితమైన అవసరం. ప్యాకెట్ సైజు చిన్నదిగా చేసి కేవలం చిప్స్ మాత్రమే నింపితే.. మీరు తెరిచేసరికి అన్నీ ముక్కలై పిండిలా మారిపోతాయి.

కాబట్టి, ఇకపై చిప్స్ ప్యాకెట్ తెరిచినప్పుడు సగం గాలి కనిపిస్తే మోసపోయామని ఫీలవ్వకండి.. ఆ గాలే మీ చిప్స్‌ను పాడుకాకుండా, ముక్కలు కాకుండా కాపాడుతున్న సైలెంట్ బాడీగార్డ్ అనుకోండి!

Read more Photos on
click me!

Recommended Stories