Balcony Garden: మీ బాల్కనీ అందంగా కనిపించాలంటే ఈ వేసవి పూల మొక్కలు ఉండాల్సిందే

Published : Jun 03, 2025, 06:03 AM IST

Balcony Garden: బాల్కనీ లేదా ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా.. ఏవేవో పూల మొక్కలు పెంచడం కంటే ఇక్కడ తెలిపిన 7 రకాల పూల మొక్కలు పెంచితే మీ గార్డెన్ అద్భుతంగా కనిపిస్తుంది. 

PREV
16
చిన్న గులాబీలు

ఈ గులాబీలు చిన్నగా ఉండటం వల్ల చాలా క్యూట్ గా ఉంటాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి వేసవి అంతా పూస్తాయి. ఎంతటి ఎండనైనా తట్టుకుంటాయి. గుత్తులుగా పూస్తాయి కనుక చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని కోసేటప్పుడు పక్కవి దెబ్బతినకుండా కోస్తే పూలు దెబ్బతినకుండా ఉంటాయి.

26
జిన్నియాలు

జిన్నియా పూలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి చాలా సులభంగా కూడా పెరుగుతాయి. వేసవి నుండి శరదృతువు ప్రారంభం వరకు ఇవి పెరుగుతాయి. తీవ్రమైన ఎండలు, వేడి పరిస్థితులను తట్టుకోగలవు. ఇవి ఎక్కువగా సీతాకోకచిలుకలను ఆకర్షిస్తాయి. 

36
పెటునియాలు

పేరు విచిత్రంగా ఉన్న ఈ మొక్కను ఎక్కువగా ఇంటి అలంకరణ కోసం పెంచుతారు. ఇది రకరకాల రంగుల్లో లభిస్తుంది. ఈ పూలు విస్తారంగా వికసిస్తాయి. వేసవి అంతా ఈ పూలు పూస్తాయి. వేలాడే బుట్టలు లేదా రెయిలింగ్ పెట్టెల్లో ఈ పూల మొక్కలను పెంచితే మీ బాల్కనీ అందంగా మారిపోతుంది. 

46
బిగోనియాలు

ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా చక్కగా పెరుగుతాయి. ఎప్పుడూ పూలు, ఆకులతో నిండుగా ఉంటాయి. వీటిని ఇంటి అలంకరణ కోసమే ఎక్కువగా పెంచుతారు. ఇవి నీడలో కూడా పెరుగుతాయి. వేసవి నుండి శరదృతువు ప్రారంభం వరకు వీటిని పెంచొచ్చు. 

56
చామంతి పూలు

తెగుళ్లను తట్టుకొనే పెరిగే పూల మొక్కల్లో చామంతి మొక్కలు టాప్. ఇవి మొక్క నిండుగా పూలు పూస్తాయి. వేసవి నుంచి మొదలు కొని శరదృతువు ప్రారంభం వరకు ఈ పూలు పూస్తాయి. మీ బాల్కనీకి రెట్టింపు అందాన్నిస్తాయి. 

66
లవెండర్

మీ ఇల్లు సువాసనతో నిండిపోవాలనుకుంటే వెంటనే మీరు లవెండర్ మొక్కలు పెంచండి. సువాసనతో పాటు సీతాకోకచిలుకలను ఇవి ఆకర్షిస్తాయి. అందువల్ల పూలతో పాటు సీతాకోకచిలుకలతో మీ బాల్కనీ నిండిపోతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories