గ్యాస్ట్రిక్ సమస్యలను తరిమికొట్టేందుకు సూపర్ టిప్స్.. ఇలా చేస్తే చాలు!

Published : Jun 11, 2022, 03:45 PM IST

సమయానికి తినకపోవడం, తిన్నది జీర్ణం కాకపోవడం, కడుపులో మంట వంటి ఇతర సమస్యలతో గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని వంటింటి టిప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం..

PREV
17
గ్యాస్ట్రిక్ సమస్యలను తరిమికొట్టేందుకు సూపర్ టిప్స్.. ఇలా చేస్తే చాలు!

మనం తినే ఆహారాన్ని సరిగా నమలకుండా (Without chewing properly) వేగంగా మింగటం, మాట్లాడుతూ తినడంతో మనకు తెలియకుండానే గాలిని కూడా మింగేస్తూంటాం. అలాగే ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే లేవడం, వేళకు తినకపోవడం, ఆయిల్, జంక్ ఫుడ్స్ (Junk Foods) ను ఎక్కువగా తీసుకోవడం ఇలా ఎన్నో కారణాలతో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.

 

27

అంతేకాకుండా ఆల్కహాల్ (Alcohol) ఎక్కువగా సేవించడం, ప్రోగ తాగడం, ఒత్తిడి, ఆందోళన, జీర్ణకోశ సంబంధిత సమస్యలతో (Gastrointestinal problems) కూడా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా నలుగురిలో కలవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

37

జీలకర్ర, వాము: జీలకర్ర, వాము గ్యాస్ సమస్యను తగ్గించడానికి మంచి ఔషధంగా సహాయపడతాయి. ఒక గ్లాసు నీటిలో స్పూన్ జీలకర్ర (Cumin), వామును (Ajwain) రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా రోజూ ప్రయత్నిస్తే మెటబాలిజంతోపాటు జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.

 

47

అల్లం పొడి, వాము పొడి, ఉప్పు, నిమ్మరసం: గ్యాస్ సమస్య నుంచి తక్షణ ఉపశమనం కోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం పొడి (Ginger powder), వాము పొడి (Ajwain powder), కాస్త ఉప్పు (Salt), నిమ్మరసం (Lemon juice) కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. దీంతో ఉదర ఆరోగ్యం మెరుగుపడి గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.

57

ముల్లంగి రసం, తేనె: ముల్లంగి, తేనెలో ఉండే ఔషధ గుణాలు గ్యాస్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక ముల్లంగి రసంలో (Radish juice) కాస్త తేనె (Honey) కలుపుకొని తాగితే గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ముల్లంగి రసం, తేనెలో ఉండే ఫైబర్ ఎసిడిటీని తగ్గించి అజీర్తి, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.

67

పాలు, గులాబీ రేకులు: కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడానికి పాలు, గులాబీ రేకులు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇందుకోసం పాలలో (Milk) గులాబీ రేకులను (Rose petals) మరిగించి తాగితే ఉదర సమస్యలు తగ్గుతాయి. దీంతో ఉదర భాగం ఆరోగ్యంగా ఉంటుంది.

77

పుదీనా ఆకులు: పుదీనా ఆకుల్లో (Mint leaves) ఉండే గుణాలు ఆసిడ్ ఉత్పత్తిని నిరోధించడంతోపాటు కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇందుకోసం పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి వడగట్టి చల్లార్చి ఆ నీటిని తాగితే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అలాగే జీర్ణప్రక్రియ (Digestive process) కూడా మెరుగుపడుతుంది.

click me!

Recommended Stories