
డార్క్ చాక్లెట్స్ (Dark chocolates) నోటికి రుచి అందించడంతోపాటు ఆరోగ్యానికి, అందానికి అనేక ప్రయోజనాలను (Benefits) కలుగజేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డార్క్ చాక్లెట్స్ ను కోకో చెట్టు నుండి సేకరించిన విత్తనాలతో తయారు చేస్తారు. డార్క్ చాక్లెట్స్ లో ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియంలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి అనేక ప్రయోజనాలను కలగజేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు (Flavonoids) శరీరంలోని సిరలు, ధమనులు సాధారణంగా పనిచేయడానికి సహాయపడతాయి.
అలాగే శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరిచి మెదడు, గుండెకు రక్త సరఫరా (Blood supply) సక్రమంగా జరిగేలా చేస్తాయి. దీంతో మెదడు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే జ్ఞాపకశక్తి (Memory) కూడా పెరుగుతుంది. రక్తం గడ్డకట్టుకుపోయే సమస్యల నుంచి కూడ కాపాడుతుంది. డార్క్ చాక్లెట్ లోని గుణాలు రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. అంతే కాకుండా శరీరంలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను నష్టపరిచే ఫ్రీరాడికల్స్ తో పోరాడి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. డార్క్ చాక్లెట్ లోని మెగ్నీషియం (Magnesium) టైప్ 2 డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. అలాగే ఇందులో ఉండే ఔషధ గుణాలు చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి. ఒత్తిడి (Stress), ఆందోళన వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఒక డార్క్ చాక్లెట్ ను తీసుకుంటే మంచిది.
ఇది మానసిక స్థితులపై అనుకూల ప్రభావాన్ని కలిగించే రసాయన సమ్మేళనాలను మెరుగుపరిచి మనసును తేలిక పరిచి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించి ప్రశాంతంగా (Calm down) ఉండేందుకు సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ ను తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి (Skin beauty) కూడా మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.
చర్మ సౌందర్యం కోసం ఒక కప్పులో 50 గ్రాముల కరిగించిన చాక్లెట్ (Melted chocolate), అరటిపండు గుజ్జు (Banana pulp), స్ట్రాబెర్రీ గుజ్జు (Strawberry pulp), పుచ్చకాయ గుజ్జులను (Watermelon pulp) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేస్తే చర్మ కణాలలోని మృతకణాలు తొలగిపోతాయి.
దీంతో చర్మం లోపలి నుంచి శుభ్రం అవుతుంది. అలాగే చర్మం తాజాగా మృదువుగా మారుతుంది. చర్మానికి మంచి నిగారింపు అందడం కోసం
ఒక కప్పులో ఒక స్పూన్ కరిగించిన చాక్లెట్ (Melted chocolate), ఒక స్పూన్ తేనె (Honey), పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి (Cinnamon powder) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేసే జిడ్డు సమస్యలు తగ్గి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.