నిత్యయవ్వనమైన చర్మం కోసం.. పంచసూత్రాలు..

First Published Oct 11, 2021, 1:19 PM IST

చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపించాలంటే.. తొందరగా ముడతలు, గీతలు పడి, మెరుపు తగ్గిపోకుండా ఉండాలంటే మీ రోజువారీ జీవితపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంరక్షణ విషయంలో అత్యంత జాగురూరకతతో ఉండాలి. 

ప్రతీ ఒక్కరూ అత్యంత సహజంగా ఎదుర్కునే ప్రక్రియ వృద్ధాప్యం. అయితే కొన్ని సార్లు ఈ వృద్ధాప్య ఛాయలు వయసు కంటే ముందే కనిపిస్తాయి. మరికొందరిలో ఎంత వయసు మీద పడినా వృద్ధాప్య ఛాయలు కనిపించవు. అది ఆశ్చర్యంగా ఉంటుంది. 

చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపించాలంటే.. తొందరగా ముడతలు, గీతలు పడి, మెరుపు తగ్గిపోకుండా ఉండాలంటే మీ రోజువారీ జీవితపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంరక్షణ విషయంలో అత్యంత జాగురూరకతతో ఉండాలి. 

సన్‌స్క్రీన్ : ఇది చాలా బెటర్ యాంటీ ఏజింగ్ సొల్యూషన్. ఎండ నుండి మిమ్మల్ని రక్షించడానికి ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ చర్మం డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ లేదా ముడతలకు, కాంతివిహీనంగా మారడానికి, మచ్చలు, మరకలు కనిపించడానికి ఎండ మొదటి కారణం. 

దీన్నుండి నివారణకు మీరు ఇంట్లో ఉన్నప్పుడు, ఎండ లేని సమయాల్లో కూడా 
కనీసం SPF 30 తో ఉండే సన్ స్క్రీన్ లోషన్ ను శరీరానికి రాయడం మరిచిపోవద్దు. అంతేకాదు ఎండలోకి వెళ్లాల్సి వస్తే లాంగ్ స్లీవ్‌లు, సన్ గ్లాసెస్, టోపీలు పెట్టుకోవడం.. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా జాగ్రత్త తీసుకోవడం అవసరం. 

నిద్ర : చక్కటి నిద్ర మంచి డాక్టర్ లాగా, శరీరానికి ఉపశమనంగా పనిచేస్తుంది. నిద్రలో, మీ చర్మానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. ముడతలు, మచ్చలు తగ్గిస్తాయి. అందుకే కనీసం రోజుకు ఏడు నుండి తొమ్మిది గంటల పాటు నిద్ర పోయేలా చూసుకోండి. 

ఆరోగ్యకరమైన ఆహారం : యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో నిండిన ఆహారం చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. దెబ్బతినడం, అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని కాపాడుతుంది. వృద్ధాప్యం కనిపించే సంకేతాలను నివారించడానికి మీరు తినే వాటిపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఆకుకూరలు, బెల్ పెప్పర్స్, బ్రోకలీ, క్యారెట్లు మొదలైన కూరగాయలు, పండ్లు, దానిమ్మ, బ్లూబెర్రీస్, అవోకాడో మొదలైన పండ్లను ఎక్కువగా తినాలి. వీటితో పాటు గ్రీన్ టీ, ఆలివ్ నూనెలను మీ ఆహారంలో చేర్చాలి.

మాయిశ్చరైజర్ : వయసు పెరుగుతున్నాకొద్దీ చర్మానికి క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయడం ముఖ్యం. మీరు మాయిశ్చరైజర్‌ని అప్లై చేసినప్పుడు, అది మీ చర్మంలోని నీటిని ట్రాప్ చేసి, హైడ్రేషన్ పెరిగేలా.. ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. ఇది చర్మంమీద ముడతలు, గీతలులేకుండా ఉండేలా.. సహాయపడుతుంది. ముఖ్యంగా విటమిన్ సి లేదా విటమిన్ ఎ ఉండే మాయిశ్చరైజర్‌ని వాడడం మంచిదని చెబుతున్నారు.

స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ : మీరు యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నట్లైతే.. వాటిల్లో ఏ పదార్థాలు వాడారో దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. ఃమీ చర్మాన్ని డిటాక్సిఫై, కండిషన్స్,  హీల్ చేసే ఉత్పత్తులను ఎంచుకోండి. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌తో పాటు ఆర్గానిక్ అలోవెరా జెల్ ఆక్సిజన్ అణువులను చర్మానికి సరఫరా చేస్తుంది. ఇది సూర్యకిరణాలను అడ్డుకుని చర్మం దెబ్బతినకుండా.. వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. 

click me!