MASK
గతేడాది నుంచి మాస్క్ కూడా మన జీవితంలో భాగమైపోయింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లోని ప్రజలందారూ కచ్చితంగా మాస్క్ లు ధరిస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కూడా.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే మాస్క్ లు ధరిస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా చాలా మందిపై ప్రభావం చూపింది. అందుకే.. మన నిత్య జీవితంలో మాస్క్ ఒక భాగమైంది.
అయితే.. ఈ మాస్క్ కారణంగా చాలా మంది చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఏదో కొద్ది సేపు బయటకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకోవడం అంటే ఏమీ కాదు కానీ.. కొందరు ఆఫీసుల్లో ఎనిమిది గంటలపాటు మాస్క్ ధరించాల్సి వస్తోంది. అలాంటి వారు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.
MASK
అమ్మాయిల్లో చాలా మందికి మాస్క్ వేసుకోవడం వల్ల ముఖం పై మొటిమలు, మచ్చలు రావడం మొదలౌతుందట. ఇది పక్కన పడితే.. ఎక్కువ మందిలో తలనొప్పి సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
headache
ఎక్కువ గంటలు మాస్క్ ధరించే వారిలో తలనొప్పి, బాడీ డీహైడ్రేషన్ వంటి చాలా రకాల సమస్యలు తలెత్తుతున్నాయట. అసలు వాటికి కారణమేంటో.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
headache
జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీలు , చర్మ దద్దుర్లు ఉన్నవారికి మాస్క్ ధరించడం మరింత కష్టమవుతుంది. కానీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు తమ స్వంత , అందరి భద్రత కోసం ప్రజారోగ్య చర్యలకు కట్టుబడి ఉండాలి.
సుదీర్ఘకాలం గట్టి ముసుగు ధరించడం వలన టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్ (TMJ) లో నొప్పి ఏర్పడుతుంది, ఇది మీ కింది దవడను మీ మిగిలిన పుర్రెతో కలుపుతుంది. మాస్క్ మీ దవడ కదలడానికి అనుమతించే కండరాలు , కణజాలాలను చికాకుపరుస్తుంది. దవడను ప్రభావితం చేసే నరాలు తలనొప్పి వచ్చేలా సంకేతాలు పంపే ప్రమాదం ఉంది.
మరి అలా తల నొప్పి నుంచి బయటపడాలంటే.. ఏం చేయాలి.? ఇదేకదా మీ సందేహం.. దానికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
వేసుకునే మాస్క్ బిగుతుగా ఉండకూడదట. కాబట్టి కొద్దిగా లూస్ గా ఉండేది వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఉదయం నుంచి మాస్క్ పెట్టుకున్న తర్వాత సాయంత్రం దవడలు, బుగ్గలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దాని వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చు.
మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన నోరు మూసుకొని ఉంచుకోకూడదు.అప్పుడప్పుడు నోరు తెరుస్తూ ఉండాలి. నెమ్మదిగా నోరు తెరుస్తూ, మూస్తూ ఉంచాలి. దవడలను కూడా అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి.
headache
ఎక్కువ కాలం ఒకే మాస్క్ లను ధరించ కూడదు. నెలల తరపడి అవే మాస్క్ లు కాకుండా వాటిని మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా.. ధరించిన మాస్క్ లను కూడా పూర్తిగా శుభ్రపరుచుకోవాలి.