ఆరోగ్యమైన జీవితం కావాలంటే ఈ ఆహారం తినాల్సిందే.. అవి ఏమిటంటే?

First Published Oct 17, 2021, 8:25 PM IST

మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలపైనే (Food) 
మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు శైలిలో ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు (Proteins, Vitamins) కలిగిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. 

మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలపైనే (Food)  మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు శైలిలో ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు (Proteins, Vitamins) కలిగిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరానికి కావల్సిన బలాన్నిచ్చి ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తాయి. మనం రోజు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 

పెరుగు: ఇందులో ప్రోటీన్లు పుష్క‌లంగా ల‌భిస్తుంది. కాల్షియంతో పాటు విట‌మిన్ బి2,  బి12, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. రోజు పెరుగు తీసుకుంటే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి (Immunity Power) పెరుగుతుంది. కడుపునొప్పిని నివారిస్తుంది. ఎముకలకు దృఢత్వనిస్తుంది. పెరుగులో (Curd) వాము కలుపుకుని తీసుకుంటే నోటి పూత, చిగురు నొప్పి తగ్గుతుంది. 
 

మిల్లెట్లు: మిల్లెట్లులో (milletes) అనేక పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పీచు పదార్థం, మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్ వంటి పోషక విలువలు (Proteins) ఎక్కువగా ఉంటాయి. పేగు క్యాన్సర్ తగ్గిస్తాయి. శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. విషపదార్థాలను బయటకు పంపుతాయి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పనితీరు బాగుంటుంది.
 

మసాలా దినుసులు: నిత్యం వంటకాలలో మసాలా దినుసులు (Masala's) వాడుతాం. అందులో ప‌సుపు, ల‌వంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అజీర్తి, గ్యాస్, దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. రక్తాన్ని పలుచగా ఉంచుతుంది. గుండె సమస్యలను (Heart Problems) తగ్గిస్తాయి.
 

పప్పు దినుసులు: పప్పు దినుసులు (Nuts) ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సెనగలు, కందులు, మినుములు, రాజ్మా, పెసలు వంటి పప్పులలో  పీచు పదార్థాలు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన ఉంటుంది. ఇవి జీర్ణవ్య‌వ‌స్థ (Digestion) స‌క్ర‌మంగా ప‌నిచేసేలా స‌హాయ‌ప‌డుతాయి. ప‌ప్పు దినుసుల్లో విట‌మిన్ ఎ, బి, సి, ఈ, మెగ్నిషియం, ఐర‌న్‌, జింక్ లు ఉన్నాయి.

click me!