కారంగా ఉంటుందని పచ్చిమిర్చిని పక్కన పెట్టేస్తే.. మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే మరి..!

First Published | Nov 14, 2022, 9:54 AM IST

కొంతమంది పచ్చిమిరపకాయాలను ప్రతి కూరలో వేస్తుంటారు. ఇంకొంతమంది అసలు వీటి జోలికే వెళ్లరు. కానీ వీటిని తినడం వల్ల ఒక్క బరువు తగ్గడమేంటీ.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారన్న ముచ్చట మీకు తెలుసా..? 
 

green chilli

పచ్చిమిరపకాయలు భారతీయ వంటకాల్లో ఒక సాధారణ పదార్థం. వీటిని ప్రతికూరలో ఖచ్చితంగా వేస్తుంటారు. మీకు తెలుసా..? పచ్చి మిరపకాయలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, పొటాషియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే పచ్చిమిరపకాయలను రోజూ తినాలి. అసలు పచ్చిమిరపకాయలను రోజూ వంటల్లో వేడయం వల్ల కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

కొవ్వును కరిగించి, ఊబకాయాన్ని నివారిస్తుంది

పచ్చిమిరపకాయల్లో బయోయాక్టీవ్ సమ్మేళనమైన క్యాప్సైసిన్ ఉంటుది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. క్యాప్సైసిన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కరిగిస్తుంది. అలాగే ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇవి కొవ్వును కరిగిస్తుంది. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ రోజు వారి ఆహారంలో పచ్చిమిరపకాయలను చేర్చుకోండి. కొన్ని రోజుల్లోనే మీరనుకున్న సైజ్ ను పొందుతారు. 
 

Latest Videos


యాంటీ క్యాన్సర్ లక్షణాలు

పచ్చి మిరకాయలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఆస్కార్బిక్ ఆమ్లం వంటి బయోయాక్టీవ్ సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్లు, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాప్సైసిన్ కీమో ప్రివెంటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్, కొలెరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టాటిక్ క్యాన్సర్, ఊపరితిత్తుల క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి ఎన్నో రకాల క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా, ఎదుగుదలకు వ్యతిరేకంగా పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

క్యాప్సైసిన్ దీర్ఘకాలిక నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. మిరపకాయలో ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్, కెరోటినాయిడ్ వల్ల  వస్తుంది. కెరోటినాయిడ్లు కాంతి, ఆక్సిజన్ నుంచి శరీర కణాలకు రక్షణగా ఉంటాయి. మిరపకాయలను తినడం వల్ల గుండె జబ్బుల మరణాలు రేటు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కార్డియోవాస్కులర్, టైప్ 2 డయాబెటీస్ నిర్వాహణకు పచ్చిమిర్చి మెడిసిన్ లా పనిచేస్తుంది. 

వృద్ధాప్యాన్ని నివారిస్తుంది, చర్మం మెరిసేలా చేస్తుంది

పచ్చిమిర్చిలో ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) పుష్కలంగా ఉంటుంది. ఈ ఆస్కార్బిక్  ఆమ్లం ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎక్కువ మొత్తం లో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. దీనిలో ఉండే యాంటీ  ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జీ, యాంటీ  ఆక్సిడెంట్ లక్షణాలు మీ చర్మం లోపలి నుంచి అందంగా మెరిసిపోవడానికి సహాయపడుతుంది. 
 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పచ్చిమిరకాయలు కూడా రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మనలో రోగనిరోధక వ్యవస్థను నిర్మించడానికి , నిర్వహించడానికి ఇవి ముఖ్యమైన భాగాలు. క్యాప్సైసిన్ యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి  ఉంటుంది. ఇది ఆహారంలో వ్యాధికారక సూక్ష్మజీవల నుంచి మనల్ని రక్షిస్తాయి. 

click me!