ఆయిలీ లేదా వేయించిన ఆహారాలు
ఆయిలీ ఫుడ్స్, వేయించిన ఆహారాలను పగటిపూట తిన్నా ఎలాంటి సమస్య ఉండదు. ఈ సమయంలో తింటే బాగా అరుగుతాయి. కానీ వీటిని రాత్రిపూట తింటే అంత సులువుగా అరగవు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల మీ కడుపులో శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ ఏర్పడతాయి. దీంతో వాంతులు, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి.