Parenting: పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. మంచి స్కూల్, చదువు, సౌకర్యాలు కల్పించడానికి ఎంతగానో కష్టపడతారు. నిజానికి పిల్లలకు ఏం కావాలి? అసలు మంచి పేరెంట్స్‌గా ఉండాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం ప్రతి తల్లిదండ్రుల కల. అయితే మంచి పేరెంట్‌గా ఉండాలంటే ఖరీదైన బహుమతులు కొనివ్వడం, మంచి స్కూల్లో చేర్పించడం మాత్రమే సరిపోదు. ప్రతి రోజు కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తే పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో మెరుగుపడుతుంది. నిపుణుల ప్రకారం పిల్లల కోసం పేరెంట్స్ చేయాల్సిన 5 పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
పిల్లలతో గడపడం
ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలైనా పిల్లలతో పూర్తిగా గడపాలి. ఈ సమయంలో మొబైల్ ఫోన్, టీవీ లేదా ఇతర పనులను పక్కన పెట్టి కేవలం పిల్లలపైనే దృష్టి పెట్టాలి. వారు స్కూల్లో ఏం నేర్చుకున్నారు, స్నేహితులతో ఎలా గడిపారు, ఏ విషయం వారికి ఆనందం కలిగించింది.. లేదా ఏది బాధ పెట్టింది? వంటి విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఇలా మాట్లాడటం వల్ల పిల్లలకు తల్లిదండ్రులపై నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా అమ్మా నాన్నలతో పంచుకోవాలనే భావన ఏర్పడుతుంది.
36
పిల్లలను ప్రశంసించడం
చాలామంది పేరెంట్స్ పిల్లలు తప్పు చేసినప్పుడు మాత్రమే గమనిస్తారు. కానీ వారు చేసిన మంచి పనులను కూడా గుర్తించి అభినందించాలి. చిన్న సహాయం చేసినా, చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా, మంచి ప్రవర్తన చూపించినా.. నువ్వు బాగా చేశావ్, చాలా బాగా ట్రై చేశావ్.. వంటి మాటలు చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంటారు.
పేరెంట్స్ చేసే పనులు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే పేరెంట్స్ ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడటం, టైంకి పనులు పూర్తి చేయడం, నిజాయతీగా ఉండటం వంటి అలవాట్లు పిల్లలు గమనిస్తారు. మీరు కోపాన్ని ఎలా నియంత్రిస్తున్నారో, ఇతరులను ఎలా గౌరవిస్తున్నారో కూడా వారు చూసి నేర్చుకుంటారు.
56
పిల్లల భావాలను అర్థం చేసుకోవడం
కొన్నిసార్లు పిల్లలు కోపంగా ఉండవచ్చు, ఏడవవచ్చు లేదా మౌనంగా ఉండవచ్చు. అలాంటి టైంలో వెంటనే మందలించడం కంటే, ఏమైంది?, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా? అని ప్రశాంతంగా మాట్లాడాలి. వారి భావాలను చిన్నచూపు చూడకుండా వినాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయడం నేర్చుకుంటారు.
66
కుటుంబం మొత్తం..
ప్రస్తుత బిజీ లైఫ్ లో అందరూ ఒకే టేబుల్ వద్ద కూర్చొని మాట్లాడుకునే సమయం చాలా విలువైనది. అలాంటి సమయంలో ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకుండా ఒకరి మాటలు మరొకరు వినాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు కుటుంబం ఎప్పుడూ తమకు అండగా ఉంటుందనే భరోసా పిల్లల్లో కలుగుతుంది. మంచి పేరెంట్‌గా మారడం ఒక్క రోజులో జరిగే విషయం కాదు. ప్రతి రోజు చిన్న చిన్న మార్పులు చేస్తూ ముందుకు సాగితే పిల్లల జీవితంలో గొప్ప మార్పులు కనిపిస్తాయి.