పెళ్లా? మేం చేసుకోం బాబోయ్.. మాకు ఒంటరిగా బతకడమే బాగుందంటున్న యువతులు: కారణాలు ఇవే

Published : May 02, 2025, 04:05 PM ISTUpdated : May 02, 2025, 04:10 PM IST

ఈ కాలం యువతుల దగ్గర పెళ్లి మాట ఎత్తితే చాలు.. పెళ్లి చేసుకోం బాబోయ్ అంటున్నారు. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు. ఆ కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం రండి. 

PREV
15
పెళ్లా? మేం చేసుకోం బాబోయ్.. మాకు ఒంటరిగా బతకడమే బాగుందంటున్న యువతులు: కారణాలు ఇవే

ఈ కాలంలో యువతులు తమ కెరీర్‌ను స్ట్రాంగ్ గా నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలను, కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టమని, లక్ష్య సాధనకు పెళ్లి ఆటంకం కలుగుతుందని భావిస్తున్నారు. అందుకే పెళ్లి విషయంలో వెనుకాడుతున్నారు.

25

పెళ్లిళ్లు ఫెయిల్ అవడమే కారణం

బంధువులు, స్నేహితులు లేదా సమాజంలో ఫెయిల్ అవుతున్న పెళ్లిళ్లు, బంధాలు, విడాకులు, గృహ హింస వంటివి చూసి చాలా మంది యువతులు వివాహంపై భయాన్ని పెంచుకుంటున్నారు. తొందరపాటు లేదా ఒత్తిడితో వివాహం చేసుకుని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఇష్టం లేదని బహిరంగంగానే చెబుతున్నారు.

35

సరైన జీవిత భాగస్వామి దొరకకపోవడం

తమ ఆలోచనలకు, విలువలకు, లైఫ్ స్టైల్ కి సరిపోయే జీవిత భాగస్వామి దొరకడని కొందరు యువతులు ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడుతున్నారు. బంధువులు, రూల్స్, సిల్లీ సాంప్రదాయాలు పాటించలేక, స్వతంత్రంగా బతికే అవకాశం ఉండదని పెళ్లికి నో అంటున్నారు. రాజీ పడటం కంటే ఒంటరిగా ఉండటం మేలని భావిస్తున్నారు.

45

మానసికంగా సిద్ధంగా లేకపోవడం

పెళ్లి ఒక పెద్ద నిర్ణయం. ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదు. రెండు కుటుంబాలు కలిసి ఉండాల్సిన సందర్భం. పెద్దల అనుమతి లేకపోయినా పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండలేరు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నా జంట మధ్య సఖ్యత కుదురుతుందని చెప్పలేం. ఇలాంటి ఎన్నో విషయాలు గురించి విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. అందుకే పెళ్లి చేసుకోవడానికి మానసికంగా సిద్ధపడాలి. ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేక యువతులు వివాహం నుండి దూరంగా ఉంటున్నారు.

55

వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత

వివాహం తర్వాత తమ ఫ్రీడమ్ కి భంగం కలుగుతుందని చాలా మంది యువతులు భావిస్తున్నారు. సమయ పాలన, నిర్ణయాల్లో ఇతరుల జోక్యం, కుటుంబ అంచనాలు వంటివి వారి స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయని, ఎటువంటి ఆంక్షలు లేకుండా జీవించాలని కోరుకుంటున్నారు. అందుకే వివాహం వద్దనుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories