ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీరు తాగే అలవాటు చేయండి.
ప్రతిరోజూ రాత్రి బాగా నిద్రపోయేలా చేయాలి. కథలు చెప్పి నిద్రపుచ్చడం, శ్లోకాలు పఠిస్తూ పడుకొనేలా చేయడం మంచిది.
ఉదయాన్నే రోజువారీ కార్యకలాపాలను ప్లాన్ చేసుకుని వాటిని పాటించే అలవాటు చేయండి.
ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినేలా చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో కూడా చెప్పాలి.
మీ పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా సగం విని అర్థమైంది అంటారు. కాని పూర్తిగా విని మాట్లాడే అలవాటు చేయాలి.
నడక ఏ వయసు వారికైనా చాలా మంచిది. ప్రతిరోజూ కొంత దూరం నడిచే అలవాటు చేస్తే పిల్లలు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ అవుతారు.
పిల్లలకు ఆటలు చాలా ముఖ్యం. శారీరకంగా ఆడే ఆటలతో పాటు మెదడు పనితీరును ప్రోత్సహించే ఆటలు కూడా వారితో ఆడించాలి.
యోగా శరీర అభివృద్ధికి చాలా ముఖ్యం. యోగాసనాలను వేయించడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
చదవడం అంటే స్కూల్ కి వెళ్లడం కాదు. కొత్త విషయాలను ఎలా అర్థం చేసుకొని చదవాలో వారికి నేర్పించాలి. నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో చెప్పండి.
పిల్లల్లో భయం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. కొందరు వాటిని అధిగమించలేక డల్ అయిపోతారు. పిల్లలు ఎప్పుడూ చురుగ్గా ఉండేలా యాక్టివిటీస్ చేయించండి.