Stress Busting Techniques: 5 నిమిషాల్లో మనశ్శాంతి పొందడానికి 5 అద్భుతమైన చిట్కాలు

Published : May 28, 2025, 10:47 PM IST

Stress Busting:మనం ఎన్నో కారణాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. ఈ స్ట్రెస్ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒత్తిడికి తగ్గించుకోవాలి. 5 నిమిషాల్లో మనసును శాంతపరిచే 5 అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
లోతైన శ్వాస

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అత్యంత సులభమైన, శక్తివంతమైన మార్గాలలో ఒకటి లోతైన శ్వాస. ఇది మీ నాడీ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది. వెంటనే ఆందోళనను తగ్గిస్తుంది. లోతైన శ్వాస మీ హృదయ స్పందన రేటును తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు దీన్ని చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 

25
ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్

ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటే.. శరీరంలోని వివిధ భాగాలలోని కండరాలను ముందుగా బిగించి, తర్వాత వదులు చేయడం. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించే ఒక పద్ధతి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చిత్రంలో చూపించినట్లుగా వ్యాయామం చేయడం ద్వారా మీ శరీరం, మనసు మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నిద్రలేమి, మైగ్రేన్ వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

35
ప్రకృతితో కొంత సమయం గడపండి

ప్రకృతితో కొంత సమయం గడపడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. లేదా కొంచెం సేపు చెట్ల మధ్య నడక సాగిస్తే ఒత్తిడి తగ్గుతుంది. శారీరక శ్రమ వల్ల శరీరంలో నేచురల్ మూడ్ బూస్టర్స్ అయిన ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందేలా చేస్తాయి. ఆఫీసులో లేదా ఇంట్లో ఒకే చోట కూర్చుని పనిచేసేవారికి ఈ చిన్న నడక ఒక రిఫ్రెషింగ్ బ్రేక్‌గా కూడా ఉంటుంది.

45
సంగీతం వినండి

సంగీతానికి మనసును ప్రశాంతంగా ఉంచే శక్తి ఉంది. మీకు నచ్చిన ప్రశాంతమైన లేదా ఉత్సాహాన్నిచ్చే సంగీతాన్ని వినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సంగీతం హృదయ స్పందన రేటును, రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్లాసికల్ మ్యూజిక్, వర్షం, అలలు లాంటి ప్రకృతి శబ్దాలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

55
ధ్యానం చేయండి

ధ్యానం అంటే ప్రస్తుత క్షణంలో పూర్తిగా లీనమవడం. ఇది మీ ఆలోచనలు, భావాలను గమనించడం ద్వారా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత, భావోద్వేగ సమతుల్యత మెరుగుపడతాయి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఆందోళన, భయాన్ని తగ్గించుకోవచ్చు. ప్రారంభంలో మీ మనసు అటూ ఇటూ తిరుగుతుంది. కానీ నిరంతర అభ్యాసం ద్వారా మీరు సులభంగా ఏకాగ్రత సాధించగలరు.

Read more Photos on
click me!

Recommended Stories