Power Strip Safety : ఈ 5 వస్తువులను పవర్ సాకెట్ లో అస్సలు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా..?

Published : May 12, 2026, 06:46 PM IST

ఒకేసారి చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేందుకు పవర్ స్ట్రిప్స్ (ఎలక్ట్రికల్ సాకెట్) సౌకర్యంగా ఉంటాయి. కానీ ఎక్కువ పవర్ తీసుకునే కొన్ని ఉపకరణాలను వీటిలో వాడితే ప్రమాదం. అవేంటో చూద్దాం.

PREV
15
ఎయిర్ కండీషనర్

ఏసీ పనిచేయడానికి చాలా ఎక్కువ విద్యుత్ అవసరం. దీన్ని పవర్ స్ట్రిప్‌లో పెడితే, అది వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.

25
రిఫ్రిజిరేటర్
ఫ్రిజ్‌ను ఎప్పుడూ పవర్ స్ట్రిప్‌లో వాడకూడదు. ఇది నిరంతరం పనిచేస్తుంది కాబట్టి, దీనికి స్థిరమైన, అధిక పవర్ అవసరం.
35
సౌందర్య సాధనాలకు..
హెయిర్ డ్రయర్, హెయిర్ స్ట్రెయిట్‌నర్ వంటివి వేడిని పుట్టిస్తాయి. వీటిని పవర్ స్ట్రిప్‌లో వాడటం అస్సలు సురక్షితం కాదు. ప్రమాదాలు జరగొచ్చు.
45
మైక్రోవేవ్
మైక్రోవేవ్ ఒవెన్‌కు కూడా ఎక్కువ పవర్ కావాలి. పవర్ స్ట్రిప్‌లో వాడితే వైర్లు కరిగిపోయి మంటలు వ్యాపించే ప్రమాదం ఎక్కువ.
55
చిన్నచిన్న పరికరాలు..
టోస్టర్, కాఫీ మేకర్ వంటి చిన్న కిచెన్ ఉపకరణాలు కూడా ఎక్కువ పవర్‌ను తీసుకుంటాయి. వీటిని పవర్ స్ట్రిప్‌లో వాడకపోవడమే మంచిది.
Read more Photos on
click me!

Recommended Stories