Travel: సెప్టెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు, దసరా సెలవలకు బెస్ట్ ఆప్షన్

Published : Sep 02, 2025, 05:50 PM IST

దసరా సెలవల్లో పిల్లలను ఎక్కడికి తీసుకువెళ్లాలని  ఆలోచిస్తున్నారా? అయితే.. సెప్టెంబర్ లో మన దేశంలో చూడాల్సిన మంచి ప్రదేశాలు చాలా ఉన్నాయి. మరి, అవేంటో చూద్దామా… 

PREV
15
మున్నార్, కేరళ

భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో కేరళ ఒకటి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అంది. పశ్చిమ కనుమల్లో ఉన్న మున్నార్ దాని టీ తోటలు, పొగ మంచుతో కప్పబడి ఉన్న కొండలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. మరీ ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో  ఈ ప్రదేశం మరింత అందంగా కనపడుతుంది. వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పిల్లలతో ఈ దసరా సెలవల్లో వెళ్లి రావచ్చు.

25
కూర్గ్, కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలో ఉండే కూర్గ్  బెస్ట్ పర్యాటక ప్రాంతం అని చెప్పొచ్చు. భారత దేశ స్కాట్లాండ్ అని దీనిని పిలుస్తారు. దట్టమైన అడవులు, కాఫీ తోటలు, అందమైన జలపాతాలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.  వర్షాకాలం తర్వాత టాడియాండమోల్ శిఖరం వంటి ప్రదేశాలు ట్రెక్కింగ్ కి అనుకూలంగా ఉంటాయి. 

35
డార్జిలింగ్

డార్జిలింగ్  అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ కూడా టీ తోటలు ఉంటాయి. టాయ్ ట్రైన్ స్పెషల్ అట్రాక్షన్.  ఇక తూర్పు స్కాట్లాండ్ అని పిలుచుకునే షిల్లాంగ్, జలపాతాలు, ప్రశాంతమైన సరస్సులు, పొగమంచుతో కప్పి ఉండే కొండలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.

45
పుష్పాల లోయ, ఉత్తరాఖండ్

ఉత్తరా ఖండ్ లో ఉండే పుష్పాల లయ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశం మరింత అందంగా ఉంటుంది.  ఆల్పైన్ పువ్వు, జలపాతాలు  చూడటానికి చాలా బాగుంటాయి. 

55
కొడైకెనాల్, తమిళనాడు..

సెప్టెంబర్ లో చూసి తీరాల్సిన అత్యంత అందమైన ప్రదేశాల్లో కొడైకెనాల్ ఒకటి అని చెప్పొచ్చు.  నక్షత్రం ఆకారపు సరస్సులు, పొగ మంచుతో కప్పిన కొండలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. సెలవుల్లో చూసి రావడానికి  బెస్ట్ ప్రదేశం అని చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories