బాత్ రూంలోకి పురుగులు, కీటకాలు రావొద్దంటే ఇలా చేయండి

Published : Aug 29, 2025, 07:19 PM IST

బాత్ రూం ని ఎప్పుడూ వాడటం వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ తేమకు కీటకాలు, పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకు ఎలాంటి హాని చేయకపోయినా ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే బాత్ రూంలో కీటకాలు, పురుగులు ఉండొద్దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
16
డ్రెయిన్ ఫ్లైస్

డ్రెయిన్ ఫ్లైస్ ప్రతి బాత్ రూంలో ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి శుభ్రంగా లేని బాత్ రూం లోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బాత్ రూంలో లేకుండా చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
డ్రెయిన్ ఫ్లైస్

ఈ డ్రెయిన్ ఫ్లైస్ చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ఎక్కువగా గోధుమ, బూడిద రంగులో ఉంటాయి. ఈ చిన్న కీటకాలు మురికిగా ఉండే ప్రదేశాల్లోనే తిరుగుతాయి. 

36
శుభ్రత అవసరం

చెత్త, మురికి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే బాత్ రూం ను ఎప్పటికప్పుడు క్లీనర్లతో శుభ్రం చేయాలి. వాష్ జేసిన్, షవర్ డ్రెయిన్ ను క్లీన్ గా ఉంచుకోవాలి. 

46
వేడి నీళ్లు

డ్రెయిన్ ఫ్లైస్ బాత్ రూంలోకి రావొద్దంటే వేడినీళ్లతో డ్రెయిన్ ను శుభ్రం చేయండి. దీనివల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. మురికి పేరుకుపోతే డ్రెయిన్ లో నీళ్లు అలాగే నిల్వ ఉంటాయి. అందుకే మురికి పోవడానికి వేడి నీళ్లను అందులో పోయండి. 

56
బేకింగ్ సోడా

బేకింగ్ సోడా శుభ్రపరచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బేకింగ్ సోడా, వెనిగర్ తో బ్యాక్టీరియా, మురికి ఇట్టే తొలగిపోతాయి. ఇందుకోసం అరకప్పు బేకింగ్ సోడాను, వెనిగర్ ను డ్రెయిన్ లో పోయండి. అరగంట తర్వాత శుభ్రం చేయండి. 

66
ట్రాప్ పెట్టండి

ట్రాప్‌లతో కీటకాలు రాకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఆపిల్ సైడర్ వెనిగర్ ను పోయండి. దీన్ని ప్లాస్టిక్ కవర్ తో మూసి చిన్న చిన్న రంధ్రాలను చేయండి. ఇది కీటకాలను  ఆకర్షిస్తుంది. దీంతో కీటకాలు అందులో పడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories