
చాలా దేశాలకు నదులు మంచినీటికి ముఖ్యమైన వనరులు. కానీ అసలు నదులే లేని కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో వేడి వాతావరణం, పరిమిత వర్షపాతం కారణంగా నదీవ్యవస్థలు ఏర్పడలేదు. ఇక కొన్ని దేశాలు చాలా చిన్నవి కావడంతో నదులు లేకుండా కేవలం భూభాగాన్నే కలిగివున్నాయి.
ఇలా నదులులేని దేశాల్లో ప్రజలు భూగర్భ జలాశయాలు, వర్షపు నీటి సంరక్షణ లేదా డీశాలినేషన్ ప్లాంట్ల వంటి ప్రత్యామ్నాయాలపై ఆధారపడతారు. ఇలా నదులులేని ఐదు దేశాలేవో తెలుసుకుందాం
కువైట్ నదులు లేదా సరస్సులు లేవు… కానీ ఇది చమురు సంపన్న ఎడారి దేశం. చాలా తక్కువ వర్షపాతం, ఎడారుల కారణంగా ఇక్కడ నదులు లేవు. ఇది దాదాపు పూర్తిగా డీశాలినేటెడ్ సముద్రపు నీరు, దిగుమతి చేసుకున్న నీటిపై ఆధారపడి ఉంటుంది. సహజ మంచినీటి వనరులు లేకపోవడం వల్ల దేశంలో నీటి కొరత నిరంతర ఆందోళనగా ఉంది.
మాల్దీవులు అంటే హిందూ మహాసముద్రం చెల్లాచెదురుగా ఉన్న 1,000 కంటే ఎక్కువ పగడపు ద్వీపాల సముదాయం. చదునైన భూభాగం, పోరస్ నేలల కారణంగా నదుల ఏర్పాటే అవకాశం లేదు. దేశం తన జనాభాకు మంచినీటిని అందించడానికి ఎక్కువగా వర్షపు నీటి సంరక్షణ, డీశాలినేషన్‌పై ఆధారపడుతుంది అక్కడి ప్రభుత్వం.
బహ్రెయిన్ పెర్షియన్ గల్ఫ్‌లోని ఒక చిన్న ద్వీప దేశం… దీని శుష్క వాతావరణం, పరిమిత భూభాగం కారణంగా నదులు లేవు. చారిత్రాత్మకంగా మంచినీటి బుగ్గలపై ఆధారపడి, ఇప్పుడు నీటి అవసరాలను తీర్చడానికి డీశాలినేషన్ ప్లాంట్లను, కొన్ని భూగర్భ జలాశయాలు, శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఉపయోగిస్తుంది.
ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర దేశం వాటికన్ లో నదులకు స్థలం లేదు. పూర్తిగా రోమ్‌తో చుట్టుముట్టబడి ఇది భూపరివేష్టిత ప్రాంతం. ఇది నీటి సరఫరా కోసం పూర్తిగా ఇటలీపై ఆధారపడి ఉంటుంది. దానికి స్వంత సహజ నీటి వనరులు లేవు.
సౌదీ అరేబియాలో విస్తారమైన ఎడారులు, శుష్క వాతావరణం కారణంగా శాశ్వత నదులు లేవు. బదులుగా దేశంలో వ్యవసాయంతో పాటు నగరాలు, పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడానికి భూగర్భ జలాశయాలు వాడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డీశాలినేషన్ వ్యవస్థలను ఈ దేశం కలిగివుంది.. మంచినీటి కోసం దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.