ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకాలని అందరూ కోరుకుంటారు. అందుకు మన లైఫ్ లో పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాల్సిన పని లేదు. కొన్ని మంచి అలవాట్లు ఫాలో అయితే చాలు. లైఫ్ మనకు నచ్చినట్లుగా సాగిపోతుంది. మరి ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం చాలా అవసరం. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోండి. ఇది మీ శరీరానికి ఇంధనంలా పనిచేస్తుంది. కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి. మైండ్‌ఫుల్ ఈటింగ్‌ను అలవాటు చేసుకోండి.
210
మంచి నిద్ర
ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. మానసిక స్పష్టత, భావోద్వేగాల్లో స్థిరత్వం, శారీరక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర ముఖ్యం. మన శరీరం ఉత్సాహంగా ఉండడానికి, చక్కగా పనిచేసుకోవడానికి ప్రతి రోజు రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి.
310
వ్యాయామం..
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోండి. వాకింగ్ చేయండి. డ్యాన్స్ చేయండి. లేదా సైక్లింగ్, యోగా వంటివి చేయండి.
కృతజ్ఞతతో ఉండటం అంటే కేవలం థాంక్స్ చెప్పడమే కాదు.. అదొక లోతైన భావం. మీరు పొందిన ప్రతి దాని గురించి ఆలోచించడానికి సమయం కేటాయించండి. దానివల్ల మీ లైఫ్ లో ఆనందం పెరుగుతుంది. మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను ప్రతి రోజూ రాసిపెట్టుకోండి.
510
బలమైన బంధాలు
బలమైన సామాజిక సంబంధాలు ఆనందానికి మూలాలు. కాబట్టి ప్రియమైనవారి కోసం సమయం కేటాయించండి. మంచి సంభాషణల్లో పాల్గొనండి. మీ చుట్టూ ఉన్నవారితో స్నేహంగా ఉండండి.
610
నో చెప్పడం నేర్చుకోండి
చాలామంది మొహమాటంతో కొన్ని విషయాల్లో నో చెప్పలేరు. దానివల్ల ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. కాబట్టి "వద్దు" అని చెప్పడం నేర్చుకోండి. కొన్నిసార్లు హద్దులను నిర్దేశించుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
710
వాటర్ తాగండి
శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత నీరు తాగడం ముఖ్యం. డీహైడ్రేషన్.. అలసట, తలనొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం లక్ష్యంగా పెట్టుకోండి.
810
స్క్రీన్ టైం తగ్గించండి
ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల ఆందోళన, నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ టైం తగ్గించుకోండి. ఎక్కువసేపు చూడాల్సి వచ్చినప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకోండి. ముఖ్యంగా పడుకునే ముందు స్క్రీన్ చూడకపోవడమే మంచిది.
910
కొత్త విషయాలు నేర్చుకోవడం
కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నిరంతర అభ్యాసం ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సృజనాత్మకతను కూడా పెంచుతుంది.
1010
సహాయ చేయడం
మీకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయండి. దానివల్ల మానసిక తృప్తి కలుగుతుంది. మనం చేసే చిన్న సహాయం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు తేవచ్చు. కాబట్టి ఇతరులకు సహాయపడడం మర్చిపోవద్దు.