చేపలు తింటే అలాంటి అనారోగ్య సమస్యలన్ని మాయం.. అవి ఏమిటంటే?

Navya G   | Asianet News
Published : Feb 12, 2022, 12:50 PM IST

చేపలలో (Fish) అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి శరీరంలోని కొవ్వు నిక్షేపాలను అదుపులో ఉంచడంతో పాటు శరీరంలోని జీవక్రియలు, ఆలోచన శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చేపలను తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

PREV
18
చేపలు తింటే అలాంటి అనారోగ్య సమస్యలన్ని మాయం.. అవి ఏమిటంటే?

చేపలలో క్యాల్షియం, పాస్పరస్, ప్రోటీన్, విటమిన్ డి, జింక్, ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మొదలగు ఇతర ఖనిజాలు  పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు (Omega 3 fatty acids), యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి.
 

28

గుండె జబ్బులను తగ్గిస్తుంది: చేపలలో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గించి క్రమంగా రక్తపోటును (Blood pressure) కూడా తగ్గిస్తాయి. చేపలను అధికంగా తీసుకునేవారిలో గుండెజబ్బులు (Heart disease) తక్కువగా ఉన్నాయని ఒక సంస్థ చేపట్టిన పరిశోధనలో తేలింది.
 

38

కంటి ఆరోగ్యానికి మంచిది: చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (Omega-3 fatty acids) కంటి కండరాలకు, నరాలకు పోషకాలను అందించి కంటి ఆరోగ్యాన్ని (Eye health) మెరుగుపరుస్తాయి. కనుక చేపలను తరచూ తీసుకుంటే కంటి సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది.

48

క్యాన్సర్ ను తగ్గిస్తుంది: చేపలలో ఉండే పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాల (Cancer cells) వ్యాప్తిని అడ్డుకుని క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. పెద్దపేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్ (Cancer) లను తగ్గించడానికి చేపలు సహాయపడతాయి.
 

58

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను (Cholesterol levels) తగ్గించి తిరిగి కొలెస్ట్రాల్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి. కనుక డైట్ లో చేపలను చేర్చుకోవడం ఆరోగ్యానికి (Health) మంచిది.
 

68

ఒత్తిడిని తగ్గిస్తుంది: చేపలను తీసుకుంటే మెదడులోని సెరటోనిన్ హార్మోన్ స్థాయిలు (Serotonin hormone levels) పెరుగుతాయి. ఈ హార్మోన్లు ఒత్తిడిని (Stress) తగ్గించడానికి సహాయపడుతాయి. చేపలను తీసుకుంటే ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది.

78

ఎముకలు దృఢంగా ఉంటాయి: చేపలలో విటమిన్ డి, క్యాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలకు కావలసిన పోషకాలను అందించి ఎముకలను దృడంగా (Bones stiffness) మారుతాయి. అలాగే పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి.
 

88

రక్తహీనత సమస్యలు తగ్గుతాయి: చేపలలో ఐరన్ (Iron) సమృద్ధిగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ సరిపడా చేస్తుంది. కనుక రక్తహీనత (Anemia) సమస్యలతో బాధపడేవారు చేపలను తీసుకోవడం మంచిది.

click me!

Recommended Stories