TGPSC Notification 2026 : పవర్ ఫుల్ ఆఫీసర్ జాబ్స్, పదేళ్లలో పక్కా ప్రమోషన్, నెలకు రూ.1,37,050 శాలరీ.. గట్టిగా ట్రై చేస్తే లైఫ్ సెట్

Published : Jun 08, 2026, 03:04 PM IST

Government Jobs 2026 : తెలంగాణ విద్యాశాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కేవలం డిగ్రీ, పిజి విద్యార్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మీరు అర్హులో కారో ఇక్కడ తెలుసుకొండి. 

PREV
17
తెలంగాణ విద్యాశాఖలో హైలెవెల్ జాబ్స్..

Government Jobs : తెలంగాణ యువతీయువకులకు గుడ్ న్యూస్. రాష్ట్ర విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి టిజిపిఎస్సి (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్) నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టులు తక్కువగానే ఉన్నా చాలా పవర్ ఫుల్ ఉద్యోగాలు... కొన్నిరోజుల్లోనే ప్రమోషన్ పొంది స్టేట్ లెవెల్ ఆఫీసర్ గా మారవచ్చు. లక్షల్లో శాలరీ, మంచి హోదా కలిగిన ఉద్యోగాలివి... మీరు జాబ్ కొట్టారో సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం... మీకు ఈ ఉద్యోగాలు పొందేందుకు అర్హత ఉందో లేదో ఇక్కడ తెలుసుకొండి… ఉంటే ఈ క్షణం నుండి ప్రిపరేషన్ ప్రారంభించండి. టిజిపిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.

27
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ

పోస్ట్ : స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఉద్యోగాలు

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ : TGPSC అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ పద్దతిలో దరఖాస్తుకు అనుమతి లేదు.

దరఖాస్తు తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12-06-2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 19-07-2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

దరఖాస్తు ఫీజు :

ఓసి, బిసిలకు రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి రూ.500

ప్రతి అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 చెల్లించాలి.

కేవలం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి.

37
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల ఎగ్జామినేషన్ ప్రాసెస్..

రాతపరీక్ష అక్టోబర్ 2026 ఉంటుంది. ఏ తేదీతో పరీక్ష నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తారు.

హాల్ టికెట్స్ పరీక్షకు ఏడు రోజుల ముందునుండి ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. ఎగ్జామ్ కు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఎగ్జామ్ సెంటర్లు

హైదరాబాద్ (HMDA పరిధిలో)

కరీంనగర్

ఖమ్మం

నిజామాబాద్

వరంగల్

రెండు పేపర్లతో మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పేపర్ 1 - జనరల్ స్టడీస్ ఆండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం

పేపర్ 2 - 300 మార్కులు

పార్ట్-ఏ : ఎడ్యుకేషన్ కు సంబంధించిన బేసిక్ అంశాలు - 75 ప్రశ్నలు - 150 మార్కులు

పార్ట్-బి : ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ ఆండ్ మేనేజ్మెంట్ - 75 ప్రశ్నలు - 150 మార్కులు

పేపర్ 2 ఎగ్జామ్ కు 150 నిమిషాల సమయం ఉంటుంది.

మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పేపర్ 1, 2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ ఉంటుంది. అంటే ఇది తెలుగుమీడియం చదివిన విద్యార్థులకు మంచి అవకాశం.

47
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మొత్తం పోస్టులెన్ని?

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో మొత్తం 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ జారీచేసింది. రిజర్వేషన్లు వారిగా ఖాళీలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

మల్టీజోన్-1, మల్టీజోన్-2 లో కలిపి ఓసి 09, ఈడబ్ల్యుఎస్ 2, బిసి-ఏ 2, బిసి-బి 2, బిసి-సి 1, ఎస్సి 4, ఎస్టి 2, విహెచ్ 2 పోస్టులున్నాయి.

57
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయోపరిమితి

18 నుండి 44 ఏళ్లలోపువారు అర్హులు (02-07-1982 నుండి 01-07-2008 మధ్య పుట్టినవారు)

వయోపరిమితి సడలింపు

ఎస్సి,ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్ల సడలింపు

దివ్యాంగులు - 10 ఏళ్ల సడలింపు

ప్రభుత్వ ఉద్యోగులు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు) - 5 ఏళ్లు సడలింపు

మాజీ సైనికులు - 3 ఏళ్లు

NCC (ఇన్స్ట్రక్టర్ గా పనిచేసినవారు) - 3 ఏళ్లు సడలింపు

01-07-2026 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు.

67
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు B.Ed (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) తో కూడిన బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) లో 55 శాతం మార్కులతో పాసై ఉండాలి... ఎస్సి, ఎస్టి, బిసి, దివ్యాంగులు 50 మార్కులతో పాసైనా సరిపోతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి పూర్తిచేసి ఉండాలి. 05-06-2026 వరకు తగిన విద్యార్హతలు కలిగివుండాలి.

77
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శాలరీ

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలు గ్రేడ్ 1 కి చెందినవి. అంటే మంచి శాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలనెలా రూ.58,850 నుండి రూ.1,37,050 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories