TGPSC Notification 2026 : బిటెక్ చేస్తేచాలు గవర్నమెంట్ జాబ్.. నెలనెలా లక్షల్లో శాలరీ, ఉన్నత హోదా

Published : Jun 05, 2026, 10:42 AM IST

Government Jobs Notification 2026 : మీరు బిటెక్ పాసై ఉంటే చాలు… టిజిపిఎస్సి భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. నెలనెెలా లక్షల్లో శాలరీ, మంచి హోదా కలిగిన ఈ ఉద్యోగాలతో సమాజంలో మంచి గౌరవం కూడా లభిస్తుంది.

PREV
17
తెలంగాణ యువతకు గుడ్ న్యూస్..

TGPSC Notification 2026 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC) వివిధ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్యధికం ట్రాన్స్ ఫోర్ట్, రోడ్స్ ఆండ్ బిల్డింగ్ శాఖలోనే ఉన్నాయి... సివిల్, ఎలక్ట్రికల్ కలిపి మొత్తం 271 పోస్టులు ఉన్నాయి. కేవలం బిటెక్ అర్హతతోనే ఈ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు... ఉన్నత స్థాయిలో మంచి శాలరీతో కూడిన ఉద్యోగాలు కాబట్టి గట్టిగా ట్రై చేస్తే ఉద్యోగం పక్కా, లైఫ్ సెటిల్ అయిపోతుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి తో పాటు అప్లికేషన్, ఎగ్జామ్ ప్రాసెస్, శాలరీ వంటి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

27
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ

పోస్ట్ : ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ ఆండ్ బిల్డింగ్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ : TGPSC అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ పద్దతిలో దరఖాస్తుకు అనుమతి లేదు.

దరఖాస్తు తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-06-2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 15-07-2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

దరఖాస్తు ఫీజు :

ఓసి, బిసిలకు రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి రూ.500

ప్రతి అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 చెల్లించాలి

37
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాల ఎగ్జామినేషన్ ప్రాసెస్..

పరీక్ష అక్టోబర్ 2026 ఉంటుంది. ఏ తేదీతో పరీక్ష నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తారు.

హాల్ టికెట్స్ పరీక్షకు ఏడు రోజుల ముందునుండి ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. ఎగ్జామ్ కు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఎగ్జామ్ సెంటర్లు

హైదరాబాద్ (HMDA పరిధిలో)

కరీంనగర్

ఖమ్మం

నిజామాబాద్

వరంగల్

ఎగ్జామ్ సిలబస్ :

రెండు పేపర్లతో మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.

పేపర్ 1 - జనరల్ స్టడీస్ ఆండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం (ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నపత్రం ఉంటుంది)

పేపర్ 2 - ఎలక్ట్రికల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్) - 150 ప్రశ్నలకు 300 మార్కులు - 150 నిమిషాల సమయం (కేవలం ఇంగ్లీష్ లోనే ప్రశ్నపత్రం ఉంటుంది)

47
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) మొత్తం పోస్టులెన్ని?

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్స్, రోడ్స్ ఆండ్ బిల్డింగ్ శాఖలో మొత్తం 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది టిజిపిఎస్సి. రిజర్వేషన్ల వారిగా ఖాళీలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఓసి 15, ఈడబ్ల్యుఎస్ 5, బిసి-ఏ 3, బిసి-బి 4, బిసి-డి 4, బిసి-ఇ 2, ఎస్సి 8, ఎస్టి 5, స్పోర్ట్స్ 1, హెచ్ హెచ్ 1, ఓహెచ్ 1 .

57
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు వయోపరిమితి

18 నుండి 44 ఏళ్లలోపువారు అర్హులు (02-07-1982 నుండి 01-07-2028 మధ్య పుట్టినవారు)

వయోపరిమితి సడలింపు

ఎస్సి,ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్ల సడలింపు

దివ్యాంగులు - 10 ఏళ్ల సడలింపు

ప్రభుత్వ ఉద్యోగులు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు) - 5 ఏళ్లు సడలింపు

మాజీ సైనికులు - 3 ఏళ్లు

NCC - 3 ఏళ్లు సడలింపు

01-07-2026 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు.

67
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ తప్పకుండా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి పూర్తిచేసి ఉండాలి. 02-06-2026 వరకు తగిన విద్యార్హతలు కలిగివుండాలి.

77
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) శాలరీ

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ ఆండ్ బిల్డింగ్స్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు స్టేట్ లెవెల్ కి చెందినవి. అంటే మంచి శాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలనెలా రూ.54,220 నుండి రూ.1,33,630 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories