TGPSC Notification 2026 : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలనెలా రూ.1,33,630 శాలరీతో గవర్నమెంట్ జాబ్ మీదే

Published : Jun 04, 2026, 10:46 AM IST

Government Jobs Notification 2026 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో భారీగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ ఇక్కడ చూద్దాం.

PREV
17
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో భారీ ఉద్యోగాలు..

TGPSC Notification : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు యువతకు అద్భుత అవకాశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ భారీగా ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ ఆండ్ బిల్డింగ్ (R&B) శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు ఉన్నాయి. కేవలం డిగ్రీ అర్హతతో ఉన్నత స్థాయి, మంచి శాలరీతో కూడిన పోస్టులు భర్తీ చేస్తున్నారు... కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయితే ఉద్యోగం పక్కా. ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి తో పాటు అప్లికేషన్, ఎగ్జామ్ ప్రాసెస్ వంటి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

27
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ

పోస్ట్ : ఆర్&బి డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ : TGPSC అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ పద్దతిలో దరఖాస్తుకు అనుమతి లేదు.

దరఖాస్తు తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 06-06-2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 13-07-2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

దరఖాస్తు ఫీజు :

ఓసి, బిసిలకు రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి రూ.500

ప్రతి అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 చెల్లించాలి

37
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల ఎగ్జామినేషన్ ప్రాసెస్..

పరీక్ష అక్టోబర్ 2026 ఉంటుంది. ఏ తేదీతో పరీక్ష నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తారు.

హాల్ టికెట్స్ పరీక్షకు ఏడు రోజుల ముందునుండి ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. ఎగ్జామ్ కు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఎగ్జామ్ సెంటర్లు

హైదరాబాద్ (HMDA పరిధిలో)

కరీంనగర్

ఖమ్మం

నిజామాబాద్

వరంగల్

ఎగ్జామ్ సిలబస్ :

రెండు పేపర్లతో మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పేపర్ 1 - జనరల్ స్టడీస్ ఆండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం (ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నపత్రం ఉంటుంది)

పేపర్ 2 - సివిలక్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్) - 150 ప్రశ్నలకు 300 మార్కులు - 150 నిమిషాల సమయం (కేవలం ఇంగ్లీష్ లోనే ప్రశ్నపత్రం ఉంటుంది)

47
ఆర్&బి లో భర్తీచేసే మొత్తం పోస్టులు..

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో మొత్తం 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది టిజిపిఎస్సి. జోన్లు, రిజర్వేషన్ల వారిగా ఖాళీలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

మల్టీ జోన్ - 1

ఓసి 35, ఈడబ్ల్యుఎస్ 11, బిసి-ఏ 8, బిసి-బి 11, బిసి-సి 1, బిసి-డి 7, బిసి-ఈ 4, ఎస్సి 17, ఎస్టి 11, స్పోర్ట్స్ కోటా 2, విహెచ్ 1, హెచ్‌హెచ్ 2, ఓహెచ్ 1, ఎంహెచ్ 1 పోస్టులున్నాయి. ఇలా మొత్తంగా మల్టీ జోన్ - 1 లో 112 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మల్టీ జోన్ - 2

ఓసి 34, ఈడబ్ల్యుఎస్ 10, బిసి-ఏ 8, బిసి-బి 11, బిసి-సి 1, బిసి-డి 8, బిసి-ఈ 5, ఎస్సి 16, ఎస్టి 10, స్పోర్ట్స్ కోటా 2, విహెచ్ 1, హెచ్‌హెచ్ 2, ఓహెచ్ 1, ఎంహెచ్ 1 పోస్టులున్నాయి. ఇలా మొత్తంగా మల్టీ జోన్ - 1 లో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

57
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు వయోపరిమితి

18 నుండి 44 ఏళ్లలోపువారు అర్హులు (02-07-1982 నుండి 01-07-2028 మధ్య పుట్టినవారు)

వయోపరిమితి సడలింపు

ఎస్సి,ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్ల సడలింపు

దివ్యాంగులు - 10 ఏళ్ల సడలింపు

ప్రభుత్వ ఉద్యోగులు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు) - 5 ఏళ్లు సడలింపు

మాజీ సైనికులు - 3 ఏళ్లు

NCC - 3 ఏళ్లు సడలింపు

01-07-2026 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు.

67
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు

సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ తప్పకుండా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి పూర్తిచేసి ఉండాలి. 02-06-2026 వరకు తగిన విద్యార్హతలు కలిగివుండాలి.

77
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) శాలరీ

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ ఆండ్ బిల్డింగ్స్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు స్టేట్ లెవెల్ కి చెందినవి. అంటే మంచి శాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలనెలా రూ.54,220 నుండి రూ.1,33,630 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories