లింక్డ్ఇన్ 2026 సంవత్సరానికి గాను 'టాప్ కంపెనీస్' జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ కంపెనీల లిస్ట్ ఇదే..
లింక్డ్ఇన్ 2026 సంవత్సరానికి 'టాప్ కంపెనీస్' జాబితాను విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు వేగంగా మారుతున్నాయి… ఇలాంటి సమయంలో ఉద్యోగుల కెరీర్ గ్రోత్, స్కిల్ డెవలప్‌మెంట్, సంక్షేమంపై దృష్టి పెట్టే కంపెనీలే టాప్ లో నిలిచాయి. ఏఐ యుగంలో టెక్నికల్ నైపుణ్యాలతో పాటు, మానవ సంబంధాల నైపుణ్యాలు కూడా అంతే ముఖ్యమని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
26
ఇన్ఫోసిస్
లింక్డ్ఇన్ టాప్ కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ సేవలు, కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి అనేక రంగాలకు సేవలు అందిస్తోంది.
అలాగే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసెస్‌లో అగ్రగామిగా ఉన్న యాక్సెంచర్ సంస్థ టాప్ కంపెనీల జాబితాలో ఉంది. ఎయిరో స్పేస్, బ్యాకింగ్, హెల్త్, టెక్, కెమికల్ రంగాల్లో సేవలందిస్తుంది.
36
అమెజాన్
టెక్, ఇ-కామర్స్ రంగంలో అమెజాన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. AWS క్లౌడ్ సేవలు, ప్రైమ్ వీడియో వంటి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థ గ్లోబల్ మార్కెట్ లో సత్తా చాటుతోంది.
ఇక ఫైనాన్స్ రంగంలో జేపీ మోర్గాన్ చేజ్ కీలక స్థానంలో ఉంది. రిటైల్ బ్యాంకింగ్ నుంచి అసెట్ మేనేజ్‌మెంట్ వరకు ఎన్నో సేవలు అందిస్తూ, ఉద్యోగుల వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది.
ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగంలో SAP అగ్రగామిగా ఉంది. ఈఆర్‌పీ, క్లౌడ్ సొల్యూషన్స్ ద్వారా కంపెనీల ఫైనాన్స్, హెచ్‌ఆర్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ను సులభతరం చేస్తోంది.
దీనితో పాటు, హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఐబీఎం కూడా ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది.
56
ఈ సంస్థలు కూడా టాప్..
ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, వెల్స్ ఫార్గో సంస్థలు ఉద్యోగుల ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు ఆల్ఫాబెట్ ఇంక్ ఏఐ, క్లౌడ్, సెర్చ్ టెక్నాలజీలలో ముందుంటూ కొత్త ఆవిష్కరణలు చేస్తోంది. ఈవై (EY) సంస్థ ట్యాక్స్, ఆడిట్, కన్సల్టింగ్ సేవల్లో అగ్రస్థానంలో ఉంది.
66
ఏఐ రాకతో జాబ్స్ కు దోకా లేదు...
మొత్తం మీద ఈ జాబితా ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. AI ఎంత అభివృద్ధి చెందినా, మనిషి నైపుణ్యాల విలువ తగ్గలేదు. నిరంతరం నేర్చుకోవడం, మార్పులకు అలవాటు పడటం, టీమ్‌గా పనిచేయడం వంటి స్కిల్స్ ఉన్నవారికి ఈ కంపెనీలు మంచి అవకాశాలు ఇస్తున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగం వెతుక్కునే వారికి ఇది ఒక మంచి గైడ్‌గా ఉపయోగపడుతుంది.