Jobs: నెల‌కు రూ. 3 ల‌క్ష‌ల జీతంతో ఉద్యోగాలు .. అది కూడా జ‌ర్మ‌నీలో పోస్టింగ్‌. వెంట‌నే అప్లై చేసుకోండి

Published : Feb 05, 2026, 07:31 AM IST

Jobs: విదేశాల్లో ఉద్యోగం చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త. జ‌ర్మ‌నీలో ఉద్యోగాలు చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తున్న టామ్‌కామ్ సంస్థ భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
జర్మనీలో ఉద్యోగాలపై తెలంగాణ యువతకు గుడ్ న్యూస్

విదేశాల్లో ఉద్యోగం సాధించాలనే ఆశ చాలామంది యువతలో ఉంటుంది. ముఖ్యంగా జర్మనీ లాంటి అభివృద్ధి దేశంలో స్థిరపడాలనుకునే వారికి ఇది పెద్ద అవకాశం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న టామ్‌కామ్ సంస్థ ద్వారా జర్మనీలో ఉద్యోగాల భర్తీ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుండటంతో మోసాలకు అవకాశం ఉండదు.

25
టామ్‌కామ్ రిక్రూట్‌మెంట్ ప్రత్యేకత ఏంటి?

టెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) విదేశీ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన అధికారిక సంస్థ. ప్రైవేట్ ఏజెంట్ల జోలికి వెళ్లకుండా, నేరుగా ప్రభుత్వ సంస్థ ద్వారా నియామకాలు జరుగుతాయి. తాజాగా జర్మనీలో విద్యుత్ రంగానికి సంబంధించిన కంపెనీల కోసం ట్రాన్స్‌మిషన్ లైన్ టెక్నీషియన్లను ఎంపిక చేయనున్నారు.

35
జీతం, వసతి సదుపాయాలు ఎలా ఉంటాయంటే.?

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 2,910 యూరోలు వేతనం అందుతుంది. భారత కరెన్సీలో చూస్తే ఇది సుమారు రూ. 3 లక్షలు. కంపెనీ తరపున ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారు. దీంతో నెలవారీ ఖర్చులు తగ్గి ఎక్కువ మొత్తం పొదుపు చేయవచ్చు. అయితే వీసా ప్రాసెసింగ్ ఫీజు, విమాన టికెట్ ఖర్చులు అభ్యర్థులే భరించాలి.

45
అర్హతలు, భాషా నైపుణ్యం అవసరాలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించిన ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. సాధారణంగా జర్మనీ వెళ్లాలంటే జర్మన్ భాష తప్పనిసరి. కానీ ఈ నోటిఫికేషన్ లో జర్మన్ భాష అవసరం లేదని తెలిపారు. ఇంగ్లీష్ భాషలో B1 స్థాయి నైపుణ్యం ఉండి స్పష్టంగా మాట్లాడగలగాలి. ఎత్తైన ప్రదేశాల్లో పని చేయాల్సి ఉండటంతో శారీరకంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం.

55
జాబ్ ప్రొఫైల్, దరఖాస్తు విధానం

ఎంపికైన అభ్యర్థులు జర్మనీలో విద్యుత్ సరఫరా వ్యవస్థకు సంబంధించిన పనులు చేయాలి. ముఖ్యంగా:

* ఓవర్‌హెడ్ పవర్ లైన్ల ఇన్‌స్టాలేషన్

* ట్రాన్స్‌మిషన్ టవర్ల నిర్మాణ పనులు

* ఎత్తైన ప్రదేశాల్లో భద్రతా పరికరాలతో సాంకేతిక పనులు

ఆసక్తి ఉన్నవారు తమ అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com ఈమెయిల్‌కు పంపాలి. పూర్తి వివ‌రాల కోసం 94400 48590 | 94400 49937 | 94400 51452 ఈ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించండి. అయితే ప్రైవేట్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హెచ్చ‌రిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories