Jobs: మీరు కూడా ఇదే ఉద్యోగం చేస్తున్నారా.? అయితే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే!

Published : Jan 30, 2026, 01:18 PM IST

Jobs: ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగుల‌ను భ‌య‌పెడుతోంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున జ‌రుగుతోన్న ఉద్యోగుల తొల‌గింపు దీనికి ఊత‌మిస్తోంది. తాజాగా యూఏఈకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త హుసైన్ సజ్వానీ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. 

PREV
15
ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పా?

ఇటీవల కాలంలో పెద్ద ఐటీ, టెక్ కంపెనీల్లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు జరిగాయి. వేల మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు ఒకవైపు ఉంటే, ఉద్యోగాలపై దాని ప్రభావం మరోవైపు చర్చకు వస్తోంది. భవిష్యత్తులో ఏఐ పని విధానాలను మాత్రమే కాదు, ఉపాధి రంగాన్నే పూర్తిగా మార్చేస్తుందనే అభిప్రాయం బలపడుతోంది.

25
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో హెచ్చరిక

దుబాయ్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హుసైన్ సజ్వానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌లో భారీ మార్పులు తప్పవన్నారు. ముఖ్యంగా భారత్ లాంటి ఔట్‌సోర్సింగ్‌పై ఎక్కువగా ఆధారపడే దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

35
80 శాతం ఉద్యోగాలపై ప్రభావం పడే ప్రమాదం

సజ్వానీ మాటల్లో చెప్పాలంటే, భవిష్యత్తులో ఏఐ సుమారు 80 శాతం ఉద్యోగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మ‌నుషులు చేస్తున్న పనులు క్రమంగా ఆటోమేషన్ వైపు మళ్లుతున్నాయని తెలిపారు. గతంలో ఇంటర్నెట్ వచ్చినప్పుడు వచ్చిన మార్పుల కంటే, ఏఐ ప్రభావం 100 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు.

45
ఔట్‌సోర్సింగ్ రంగంపై తీవ్ర ప్రభావం

భారత ఆర్థిక వ్యవస్థలో ఐటీ, బీపీఓ, కాల్ సెంటర్లు, బ్యాక్ ఆఫీస్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. లక్షలాది మందికి ఇవే ఉపాధి వనరులు. కానీ ఏఐ ఆధారిత ఆటోమేషన్ రావడంతో ఈ రంగం పూర్తిగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. రొటీన్ పనులు ఏఐ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంది.

55
భారత్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఏఐ అభివృద్ధిని అవకాశంగా కూడా చూడాలని నిపుణుల సూచిస్తున్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఏఐతో కలిసి పనిచేసే విధానాలపై దృష్టి పెట్టడం చాలా అవసరమ‌ని చెబుతున్నారు. ప్రభుత్వం, కంపెనీలు కలిసి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపడితే ఉద్యోగాల నష్టం తగ్గించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మార్పును నిర్ల‌క్ష్యం చేస్తే, భారత్‌కు ఇది పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories