
ISRO Jobs : చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం ఓ కల... అందులోనూ దేశసేవలో ప్రత్యక్షంగా భాగమయ్యే ప్రతిష్టాత్మక ISRO (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) వంటి సంస్థల్లో పనిచేయాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఇలాంటి సంస్థల్లో ఉన్నత విద్యావంతులకే అవకాశాలు దక్కుతుంటాయని... మనకేం ఉద్యోగాలు ఉంటాయిలే అనుకునేవారు చాలామంది ఉంటారు. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ తాజాగా ఇస్రో అతి తక్కువ విద్యార్హతలతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ అనుమానాలను పక్కనబెట్టి వెంటనే దరఖాస్తు చేసుకొండి.
ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్, టిక్నీషియన్ బి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కేవలం ఐటిఐ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగినవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కాబట్టి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది.. అలాగే మంచి సాలరీ లభిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇస్రో ఉద్యోగమంటే సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు లభిస్తుంది... దేశసేవ చేస్తున్నాననే సంతృప్తి ఉంటుంది.
అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ (PRL) ఇస్రో నిర్వహించే చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్), ఆదిత్య-ఎల్1 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే పిఆర్ఎస్ యంగ్ ఆండ్ డైనమిక్ యూత్ ను తమ పరిశోధనల్లో సహకారం కోసం నియమించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం వివిధ టెక్నికల్ పోస్టుల భర్తీకి సిద్దమయ్యింది.
1. సివిల్ - 2 పోస్టులు (OBC 1, ST 1) - గుర్తింపుపొందిన విద్యాసంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా ఫస్ట్ క్లాస్ లో పూర్తిచేసినవారు అర్హులు.
2. మెకానికల్ - 2 పోస్టులు (UR 1, ST 1) - గుర్తింపుపొందిన విద్యాసంస్థ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమా ఫస్ట్ క్లాన్ లో పూర్తిచేసి వుండాలి.
3. ఎలక్ట్రికల్ - 2 పోస్టులు (UR 1, ST 1) - గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పస్ట్ క్లాస్ లో డిప్లమా పూర్తిచేసి వుండాలి.
4. కంప్యూటర్ సైన్స్/ఐటీ - 3 పోస్టులు (UR 1, OBC 1, SC 1) - గుర్తింపుపొందిన విద్యాసంస్థ నుండి కంప్యూటర్ సైన్స్/ఐటీ పూర్తిచేసి ఉండాలి.
5. ఎలక్ట్రానిక్ - 1 పోస్ట్ (EWS) - ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పూర్తిచేయాలి.
1. ఫిట్టర్ - 1 పోస్ట్ (ST) - పదో తరగతి (SSC) లేదా అందుకు సమానమైన విద్యార్హతతో పాటు ఐటిఐ లేదా ఎన్టిసి లేదా ఎన్ఏసి లో ఫిట్టర్ ట్రేడ్ పూర్తిచేసి ఉండాలి.
2. టర్నర్ - 2 పోస్టులు (UR 1,OBC 1) - పదో తరగతి పూర్తిచేసి ITI/NTC/NAC లో టర్నర్ ట్రేడ్ చేసివుండాలి.
3. మెషినిస్ట్ - 1 పోస్ట్ (ST 1) - పదో తరగతి పూర్తిచేసి ITI/NTC/NAC లో మెషినిస్ట్ ట్రేడ్ చేసివుండాలి.
4. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 2 పోస్టులు (UR 1, OBC 1) - పదో తరగతి పూర్తిచేసి ITI/NTC/NAC లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ చేసివుండాలి.
5. ఫ్లంబర్ - 1 పోస్ట్ (UR 1) - పదో తరగతి పూర్తిచేసి ITI/NTC/NAC లో ఫ్లంబర్ ట్రేడ్ చేసివుండాలి.
6. రిఫ్రిజిరేషన్ ఆండ్ ఎయిర్ కండీషన్ మెకానిక్ - 1 పోస్ట్ (SC 1) - పదో తరగతి పూర్తిచేసి ITI/NTC/NAC లో రిఫ్రిజిరేషన్ ఆండ్ ఎయిర్ కండీషన్ మెకానిక్ పూర్తిచేసి చేసివుండాలి.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - 04 అక్టోబర్ 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరతేదీ - 31 అక్టోబర్ 2025
ఆన్లైన్ లో https://www.prl.res.in/OPAR లింక్ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు కూడా ఆన్లైన్ లోనే చెల్లించాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.750, టెక్నీషియన్-బి ఉద్యోగాలకు రూ.500 దరఖాస్తు ఫీజు ఉంటుంది. అయితే రాత పరీక్షలకు హాజరయితే చాలు మహిళలు,ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు ఈ ఫీజు రిపండ్ అవుతుంది.
18 నుండి 35 ఏళ్ళలోపు వయసుండాలి (31.10.2025 నాటికి). ఎస్సి, ఎస్టిలకు ఐదేళ్లు, ఓబిసిలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు కూడా వయసు విషయంలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపికచేపడతారు. టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు టెక్నీషియన్-బి ఉద్యోగాలను కూడా ఇదే పద్దతిలో ఎంపికచేస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.44,900 నుండి రూ.1,42,400 సాలరీ ఉంటుంది. టెక్నీషియన్-బి ఉద్యోగాలకు రూ.21,700 నుండి 69,100 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.