Railway Jobs : నెలనెలా లక్షల్లో జీతం, అలవెన్సులు... రైల్వేలో 8875 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Published : Sep 26, 2025, 12:22 PM IST

Railway Jobs : ఇండియన్ రైల్వేలో స్టేషన్ మాస్టర్ వంటి ఉన్నత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 8875 పోస్టుల భర్తీకి రైల్వే శాఖ సిద్దమయ్యింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
17
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాాల భర్తీ

Railway Jobs : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం చాలామంది యువతీయువకుల కల. రైల్వేలో మంచి సాలరీలు ఉండటమే కాదు ఉద్యోగులు కూడా ఎక్కువగా ఉండటంతో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఇక రైల్వే శాఖ ఉద్యోగులకు క్వార్టర్స్, వారి పిల్లలకు విద్యా, కుటుంబసభ్యులకు వైద్య సదుపాయాలు వంటి ఎన్నో బెనిపిట్స్ కల్పిస్తుంది. అందుకోసమే రైల్వేలో ఉద్యోగం సాధించాలని చాలామంది యువత కోరుకుంటారు.. ఇందుకోసమే ప్రత్యేకంగా సన్నద్దం అవుతుంటారు. ఇలాంటి నిరుద్యోగ యువతీయువకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది... భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలా 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 8875 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తాజా షార్ట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ (CCTS), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ జారీచేసిన రైల్వే శాఖ త్వరలోనే పూర్తిస్థాయి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) విడుదల చేయనుంది.

27
RRB NTPC ఉద్యోగాాల నోటిఫికేషన్

ఈ రైల్వే ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థులు ముందుగానే విద్యార్హతలు, దరఖాస్తు ప్రక్రియ, పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవండం మంచిది. దీనివల్ల ఏఏ ఉద్యోగాలకు అర్హతలు కలిగివున్నారో ముందే తెలుస్తుంది... తద్వారా నోటిఫికేషన్ వచ్చేవరకు వేచిచూడకుండా ముందునుండే ప్రిపేర్ కావచ్చు. ఇలా ఏ సమయంలో ఎగ్జామ్ పెట్టినా రెడీగా ఉండవచ్చు. కాబట్టి ఈ RRB NTPC ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

37
RRB NTPC ఉద్యోగాలకు దరఖాస్తులు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ Non Technical Popular Categories(NTPC) ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే అభ్యర్థులను ముందుగానే అలర్ట్ చేసింది… ఇందులో భాగంగానే షార్ట్ నోటిఫికేషన్ విడుదలచేసింది. అయితే పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడితేగానీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు, ఎగ్జామ్ తేదీలు ఖచ్చింతంగా తెలిసే అవకాశాలు లేవు.  కాబట్టి అభ్యర్థులు ఆర్ఆర్బి అఫిషియన్ వెబ్ సైట్ ను రెగ్యులర్ గా చూస్తుండాలి... దీనివల్ల ఏవైనా అప్డేట్స్ ఉంటే వెంటనే తెలుస్తాయి.

47
RRB NTPC ఉద్యోగాలకు వయో పరిమితి

గతంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించిన NTPC ఉద్యోగాల భర్తీ ప్రక్రియను బట్టి కొన్ని కీలక వివరాలు తెసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే పోస్ట్, విద్యార్హతలను బట్టి వయో పరిమితి ఎంతనేది నిర్దారిస్తారు. గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్హతలు కలిగిన పోస్టులకు 18 నుండి 36 ఏళ్లలోపు వయసు... అంతకంటే తక్కువ విద్యార్హతలు కలిగిన పోస్టులకు అయితే 18 నుండి 33 ఏళ్లలోపు అర్హులుగా నిర్దారించే అవకాశాలుంటాయి. రిజర్వేషన్లు, ఎక్స్ సర్వీస్ మెన్స్, పిడబ్ల్యుడి వారికి వయోపరిమితిలో కొంత మినహాయింపు ఉంటుంది.

57
RRB NTPC ఉద్యోగాలకు విద్యార్హతలు

ఈ NTPC పోస్టులకు రెండు రకాల విద్యార్హతలు కలిగినవారు అర్హులు. ఉన్నత విద్యార్హతలు అంటే డిగ్రీ, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగినవారు స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (JAA), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి ఉన్నత ఉద్యోగాలకు అర్హులు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్హతతో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వంటి కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇలా మొత్తంగా గ్రాడ్యుయేట్ అర్హతలతో 5817, అండర్ గ్రాడ్యుయేట్ అర్హతలతో 3058 పోస్టులను భర్తీ చేయనున్నారు.

67
RRB NTPC ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

ఆర్ఆర్బి రెండు దశల్లో ఈ NTPC ఉద్యోగాల భర్తీ చేపడతుంది. మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులకు పిలుస్తారు. వీటి ఆధారంగా ఫైనల్ అభ్యర్థులను ఎంపికచేస్తారు.

77
RRB NTPC ఉద్యోగుల సాలరీ

రైల్వే శాఖలో ఉద్యోగులకు మంచి జీతాలే ఉంటాయి. ఈ NTPC ఉద్యోగులకు కూడా 7వ సెంట్రల్ పే కమీషన్ (CPC) ప్రకారం సాలరీలు ఉంటాయి. వివిధ రైల్వే జోన్ల పరిధిలో అలవెన్సులు, ఇతర కారణాల వల్ల సాలరీల్లో కొంత మార్పు ఉండవచ్చు. గ్రాడ్యుయేట్ విద్యార్హతలు కలిగిన కొన్ని జాబ్స్ కి లక్షల్లో సాలరీ ఉంటుంది… మొత్తంగా ఈ NTPC ఉద్యోగులకు ఐదంకెల జీతం తప్పనిసరిగా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories