Jobs : పదో తరగతి పాసైతే చాలు.. ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏది లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్

Published : Jan 24, 2026, 05:56 PM IST

Government Jobs Recruitment : రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సిన పనిలేదు… పదో తరగతిలో మంచి మార్కులుంటే చాలు, నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు. కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకొండి. 

PREV
15
పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు

India Post Recruitment 2026 2026 : చదువు తర్వాత మంచి జీతంతో స్థిరమైన ఉద్యోగం అందరి కల. కానీ కఠినమైన పరీక్షలు, ఇంటర్వ్యూల వల్ల చాలామంది వెనకడుగు వేస్తారు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. భారత తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు ఎలాంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదు.. కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది.

25
తపాలాశాఖలో 25 వేల ఉద్యోగాలు

భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తక్కువ విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

35
దరఖాస్తు ప్రక్రియ

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 4 ఫిబ్రవరి 2026

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 5 ఫిబ్రవరి 2026 (రాత్రి 11 గంటల వరకు)

మెరిట్ లిస్ట్ విడుదల అంచనా తేదీ: 20 ఫిబ్రవరి 2026

45
టెన్త్ మార్కుల ఆధారంగా జాబ్స్

అభ్యర్థుల ఎంపిక నేరుగా టెన్త్ మెరిట్ లిస్ట్ ఆధారంగా జరుగుతుంది. 10వ తరగతి మార్కులకు ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా గణితంలో వచ్చిన మార్కులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మంచి మార్కులుంటే ఓ ఉద్యోగం మీదే.

55
శాలరీ

ఎంపికైన వారికి 7వ వేతన సంఘం ప్రకారం నెలకు రూ.10,000 నుండి రూ.29,480 వరకు జీతం లభిస్తుంది. ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశం. చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories